బీహార్ కిషన్‌గంజ్ జిల్లాలోని టెరాయ్ ప్రాంతంలోని ఓ గ్రామం నుండి అత్యంత విషపూరితమైన పామును అటవీ అధికారులు రక్షించారు. ఫారంగోల గ్రామం నుండి ఫారెస్ట్ గార్డు అనిల్ కుమార్ బందీ చేసిన క్రెయిట్‌ను రక్షించాడు. మానవులు ఇతర జీవులతో ఎలా ఉండాలి అని వివరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను బీహార్ పర్యావరణ అటవీ, వాతావరణ మార్పుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దీపక్ కుమార్ సింగ్ షేర్ చేశారు. ఇది ట్విట్టర్‌లో ఇప్పటివరకు 6,800 వ్యూస్ వచ్చాయి. వీడియోలో అనిల్ కుమార్ రాత్రిపూట గ్రామస్థులు చుట్టుముట్టినట్లు, మరొక వ్యక్తి పాము ఉన్న బ్యాగ్‌ను పట్టుకున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.
“దయచేసి నా మాట వినండి” అని అనిల్ కుమార్ హిందీలో ప్రసంగించారు. ఇది (పాము) కూడా ఒక జీవి, మనం వాటికి భయపడాల్సిన అవసరం లేదు. మనం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. పాములు కూడా ప్రకృతిలో భాగమే. దేవుడు అన్ని జీవితాల కోసం ఒక నిర్దిష్ట పాత్రను సృష్టించాడు. కొంతమంది పాములను చంపుతారు, కానీ మీరు మమ్మల్ని పిలిచినందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ పామును దాని నివాస స్థలంలోకి విడుదల వదిలేస్తాం. మీ అందరికీ నా విన్నపం ఏమిటంటే, దయచేసి పాములను చంపవద్దు, మాకు ఎల్లప్పుడూ తెలియజేయండి” అని ఆయన అన్నారు. పామును రక్షించినందుకు అనిల్ కుమార్‌ను అటవీ శాఖ అధికారులు అభినందించారు.
Together we can, Together we will!
A Banded Krait, highly venomous, found in terai region, successfully rescued by our forest officials from Pharingola village of Kishanganj, Bihar. Salute to Forest Guard, Anil Kumar for impromptu speech to create awareness 1/2 pic.twitter.com/qPg0T8k7Al
— Dipak Kumar Singh (@DipakKrIAS) October 23, 2021