Trending Video: విశ్రాంతి కోసం చెట్టెక్కిన సింహం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..? తెలిస్తే నవ్వకుండా ఉండలేరు..

అడవిలో సింహానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎంతో క్రూర మృగంగా చెప్పుకునే సింహాన్ని అడవికి రాజుగా కూడా పరిగణిస్తారు. ఏదైనా దాని కంట పడితే ఇక యమ ద్వారం తలుపులు తెరుచుకున్నట్లే.. కనిపించినదానిని..

Trending Video: విశ్రాంతి కోసం చెట్టెక్కిన సింహం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..? తెలిస్తే నవ్వకుండా ఉండలేరు..
Lion Fall From Tree

Updated on: Jan 20, 2023 | 6:57 AM

అడవిలో సింహానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎంతో క్రూర మృగంగా చెప్పుకునే సింహాన్ని అడవికి రాజుగా కూడా పరిగణిస్తారు. ఏదైనా దాని కంట పడితే ఇక యమ ద్వారం తలుపులు తెరుచుకున్నట్లే.. కనిపించినదానిని ముక్కలు చేసి తినకుండా ఊరుకోదు. మరి అలాంటి సింహానికి సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో పోస్ట్ అవుతూనే ఉంటాయి. సింహం నిజానికి క్రూరమృగం అయినప్పటికీ దాని మెంటాలిటీ అద్భుతం. అందుకే అందరూ కూడా సింహాలంటే ఇష్టపడుతుంటారు. వారి యాటిట్యూడ్‌ను సింహం మెంటాలిటీగా చెబుతుంటారు. అయితే ఇప్పుడు సింహానికి చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే సింహాన్ని చూసి భయపడేవారు కూడా నవ్వకుండా ఉండలేరు.

waowafrica అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన సింహం వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇక ఈ వీడియోలో ఒక సింహం చెట్టు ఎక్కి ఉండడాన్ని, ఆపై అది జారి కింద పడడాన్ని మనం చూడవచ్చు. సింహం తన వేట ముగిసిన తర్వాత ప్రశాంతమైన నిద్ర కోసం చెట్లపై నిద్రిపోయే దృశ్యాలను మనం ఎన్నో చూసి ఉంటాము. కానీ చెట్టు మీద నుంచి సింహం.. కాదు కాదు అడవికి రాజు కింద పడిపోవడం అంటే మామూలు విషయం కాదు కదా.. ఆ కారణంగానే ఏమో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న సింహం వీడియోను ఇక్కడ చూడండి..

కాగా, ఇప్పటివరకూ దాదాపు 6 వేల లైకులు వచ్చిన ఈ వీడియోను చూసి నెటిజన్లు నవ్వకుండా ఉండలేకపోతున్నారు. అంతేకాక వారి వారి స్పందనలను కామెంట్ల రూపంలో తెలియచేస్తున్నారు. ఇకసింహాలు చెట్లు ఎక్కడం కనిపించడం ఇదే మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెట్లపై విశ్రాంతి తీసుకుంటూ కనిపించాయి.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..