Viral Video: మనసును హత్తుకునే దృశ్యం అంటే ఇదేనేమో.. బిడ్డకు జన్మనిస్తున్న ఖడ్గమృగం.. వైరల్ అవుతున్న వీడియో..

జంతువులకు సంబంధించినవి అయితే నెటిజన్లు ఎగబడి మరీ చూస్తారంటే అతిశయోక్తి కాదేమో.. మరి అదే ఏదైనా అడవి జంతువు తన బిడ్డకు జన్మనిచ్చే వీడియో అయితే..? దానిని

Viral Video: మనసును హత్తుకునే దృశ్యం అంటే ఇదేనేమో.. బిడ్డకు జన్మనిస్తున్న ఖడ్గమృగం.. వైరల్ అవుతున్న వీడియో..
Rhino Giving Birth To Calf

Updated on: Dec 20, 2022 | 11:02 AM

నేటి కాలంలో సోషల్ మీడియా తెలియని వారంటూ లేరు. ఇక సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యే వీడియోల గురించి మనకు తెలిసిందే. అయితే వాటిల్లో కొన్ని మన మనసులకు హత్తుకుంటాయి.  ముఖ్యంగా జంతువులకు సంబంధించినవి అయితే నెటిజన్లు ఎగబడి మరీ చూస్తారంటే అతిశయోక్తి కాదేమో.. మరి అదే ఏదైనా అడవి జంతువు తన బిడ్డకు జన్మనిచ్చే వీడియో అయితే..? దానిని వైరల్ చేసే వరకు వదిలిపెట్టలేరు నెటిజన్లు. ఎందుకంటే అవి మన మనసుకు చాలా నచ్చుతాయి. అయితే అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ ఖడ్గమృగం తన బిడ్డకు జన్మనివ్వడాన్ని మనం చూడవచ్చు.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రామెన్ షేర్ చేసిన ఈ వీడియోను మొదట ‘వైల్డ్‌ఫ్రెండ్స్ ఆఫ్రికా’ అనే  ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ అయింది. ఎవరు ముందుగా చేసినా, ఎవరు తర్వాత చేసినా వీడియో అయితే నెటిజన్లకు బాగా నచ్చేసింది. “ఇలాంటి విలువైన క్షణాలను చూడటం చాలా అరుదు. 16 నుంచి 18 నెలల గర్భధారణ తర్వాత, మరో కొత్త జీవితం’’ అంటూ సుధా రామెన్ తన పోస్ట్‌కు కాప్షన్ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

ఈ వీడియోలోని అరుదైన దృశ్యం ఇంటర్నెట్‌ని మంత్రముగ్దులను చేసింది. “ఇలాంటి అరుదైన సందర్భాలు కనిపించడం చాలా అరుదు”అని ఓ నెటిజన్ రాయగా, “నిజంగా అందమైన క్షణం. తల్లి, దూడ సుదీర్ఘమైన ఇంకా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నేను కోరుకుంటున్నాను” అని మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ క్రమంలోనే ఆ వీడియోకు ఇప్పటి వరకు దాదాసు లక్ష 2 వేల వీక్షణలు అందాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..