Viral Video: చుట్టూ ఉధృతంగా ప్రవహిస్తున్న నది.. చాలా తెలివిగా ప్రాణాలు దక్కించుకున్న ఏనుగు.. వీడియో చూస్తే షాక్ అవుతారు..!

|

Oct 20, 2021 | 5:21 AM

Viral Video: భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ అతలాకుతలం అవుతోంది. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు కొండచరియలు విరిగిపడుతున్నాయి.

Viral Video: చుట్టూ ఉధృతంగా ప్రవహిస్తున్న నది.. చాలా తెలివిగా ప్రాణాలు దక్కించుకున్న ఏనుగు.. వీడియో చూస్తే షాక్ అవుతారు..!
Elephant
Follow us on

Viral Video: భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ అతలాకుతలం అవుతోంది. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ భారీ వర్షాల ధాటికి సామాన్య ప్రజలే కాదు.. జంతువులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక మూగ జీవాలు వరదల్లో కొట్టుకుపోతున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ అటవీ ప్రాంతంలో వరదలు ఏ విధంగా బీభత్సం సృష్టిస్తున్నాయనే దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో పొంగిపొర్లుతున్న గౌలా నది మధ్యలో ఓ ఏనుగు చిక్కుకుంది. తనను తాను రక్షించుకునేందుకు ఆ ఏనుగు శతవిధాలా ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో కొంత రిస్క్ తీసుకున్నప్పటికీ.. తెలివిగా ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. 1 నిమిషం 13 సకన్ల పాటు ఉన్న ఈ వైరల్ వీడియోలో.. ఏనుగు గౌలా నది వరదల్లో చిక్కుకుపోయింది. చుట్టూ బీభత్సంగా వరద ప్రవహిస్తోంది. ఏనుగు ఎటువైపు వెళ్లాలో అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో.. చాలా తెలివిగా అటూ ఇటూ చూసి ఎటువైపు అయితే ప్రవాహం తక్కువగా ఉందో.. అటువైపు నుంచి నదిని జాగ్రత్తగా దాటేసింది. తన ప్రాణాలను రక్షించుకుంది.

దీనికి సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సురేంద్ర మెహ్రా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘ఉధృతంగా ప్రహరిస్తున్న నదిలో ఏనుగు చిక్కుకుంది. చివరికి చాలా తెలివిగా ఆ ప్రమాదం నుంచి బయటపడింది. వాస్తవానికి అడవి జంతువులకు ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కోగల సామర్థ్యం ఉంది.’’ అని ఆయన క్యాప్షన్ పెట్టారు. కాగా, ఏనుగు క్షేమంగా బయటపడటంతో నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాని ఆలోచనలకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ వీడియోను మంగళవారం నాడు ట్విట్టర్‌లో పోస్టు చేయగా.. గంటల వ్యవధిలోనే 10 మందికి పైగా వీక్షించారు. కాగా, ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వరదల కారణంగా మంగళవారం నాడు ఒక్క రోజే రాష్ట్రంలో దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక వర్షాల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 16కి చేరింది.

Viral Video:

Also read:

Huzurabad Elections: మరింత హీటెక్కిన హుజూరాబాద్.. తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఈసీకి బీజేపీ ఫిర్యాదు..

Andhra Pradesh: టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడులు.. కన్నెర్ర చేసిన నారా లోకేష్.. సీఎం వైఎస్ జగన్‌పై సంచలన కామెంట్స్..

Badvel Elections: త్వరలోనే సీఎం వైఎస్ జగన్‌కు చెక్ పెడతాం.. బీజేపీ నేత సెన్షేషనల్ కామెంట్స్..