ప్రపంచంలో చాలా మంది వివిధ రకాలుగా రికార్డులు సృష్టించారు. పొడవాటి నాలుక, పొడవాటి గోర్లు, పొడవాటి జుట్టు ఇలా రకరకాలుగా గిన్నిస్ రికార్డులు సృష్టించారు. ఇక గిన్నిస్ రికార్డు అంటనే ఎక్కువగా చిత్ర విచిత్రాలు చేస్తూ తమ పేర్లు నమోదు చేసుకుంటారు.. అలాంటి వారు కనీసం మన ఊహకు కూడా అందని అంశాల్లో ప్రతిభ కనబరుస్తుంటారు. వారికున్న భిన్నమైన నైపుణ్యంతో ప్రపంచస్థాయిలో ప్రాముఖ్యత సంపాందించి గిన్నిస్ వరల్డ్ రికార్డు బుక్ లో స్థానం సంపాదించుకుంటారు. ఇప్పుడు అలాంటి మరో వింతైన విషయంలో ఓ వ్యక్తి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించారు. ఒక అమెరికన్ మహిళ తన పొడవైన గడ్డంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అదే గడ్డంతో ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అవును, అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన 38 ఏళ్ల ఎరిన్ హనీకట్ పొడవైన గడ్డంతో సరికొత్త రికార్డు సృష్టించింది. ముఖ్యంగా, ఎరిన్ హనీకట్ తన 11.8-అంగుళాల (29.9 సెం.మీ.) గడ్డాన్ని దాదాపు 2 సంవత్సరాలుగా పెంచుతున్నట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రెస్ రిలీజ్ తెలిపింది.
మహిళల్లో విపరీతంగా జుట్టు పెరగడానికి కారణమయ్యే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) అనే వ్యాధితో బాధపడుతున్న ఎరిన్ హనీకట్ 11.8 అంగుళాల పొడవునా గడ్డం పెంచి ఈ ఘనత సాధించింది. PCOS పరిస్థితి హార్మోన్ల అసమతుల్యత, సక్రమంగా పీరియడ్స్, బరువు పెరుగుట, వంధ్యత్వానికి కారణమవుతుంది.
గతంలో అమెరికాకు చెందిన 75 ఏళ్ల వివాన్ వీలర్ పేరిట ఉన్న 10.04 అంగుళాల గడ్డం రికార్డును ఎరిన్ బద్దలు కొట్టింది. చిన్నప్పటి నుంచి జన్యుపరమైన సమస్య ఉన్న ఎరిన్ 13 ఏళ్ల నుంచి క్రమంగా గడ్డం పెంచడం ప్రారంభించింది. అంతకుముందు గడ్డం గురించి ఆందోళన చెందే ఎరిన్, రోజుకు మూడు నాలుగు సార్లు షేవింగ్ చేసేది.
గడ్డం పెరగడంపై విసుగెత్తి పోయిన ఆమె…షేవింగ్, వ్యాక్సింగ్, ముఖంపై హెయిర్ తొలగించడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల ఉత్పత్తులను ఉపయోగించడం ప్రారంభించింది. కొంతకాలం తర్వాత ఆమె రక్తపోటుతో పాక్షికంగా అంధత్వానికి గురైంది. ఆ తర్వాత బాక్టీరియా బారిన పడి ఒక కాలు కూడా కోల్పోయింది. అక్కడి నుంచి ఆమె తన గడ్డం వెంట్రుకలు తీయడం మానేసింది. గడ్డం పెంచడంపై దృష్టి పెట్టింది.. తద్వారా ప్రపంచ రికార్డు సృష్టించగలిగింది. ఎరిన్ ఇప్పుడు తన గడ్డం గురించి గర్వంగా చెబుతున్నారు. దానితో తాను సంతోషంగా ఉన్నానని చెప్పింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..