అర్ధాంగికి..ఆ మాత్రం సర్‌ప్రైజ్ ఇవ్వకపోతే ఎలా?

|

Jul 27, 2019 | 9:15 PM

భర్త  కోసం తన జీవితాన్ని ధారబోస్తుంది భార్య. తాళి కట్టగానే అప్పటివరకు ప్రేమను పంచిన తల్లిదండ్రులను, సొంత ఊరిని మరోచోటికి వస్తుంది. ఈ విషయంలో ప్రపంచంలో ప్రతి స్త్రీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. భార్య గొప్పదనాన్ని గుర్తించిన ఓ భర్త ఎట్‌లీస్ట్ తన భార్య పుట్టిన రోజునైన ఏదైనా సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాడు. ఆమెకు పార్శిల్స్ అందుకోవడం అంటే ఇష్టం కావడంతో ఆ దిశగానే ఆలోచించాడు. అసలే ఫోటోగ్రాఫర్ కావడంతో సరికొత్త ఐడియాతో ముందుకు వెళ్లాడు. అచ్చం […]

అర్ధాంగికి..ఆ మాత్రం సర్‌ప్రైజ్ ఇవ్వకపోతే ఎలా?
Follow us on

భర్త  కోసం తన జీవితాన్ని ధారబోస్తుంది భార్య. తాళి కట్టగానే అప్పటివరకు ప్రేమను పంచిన తల్లిదండ్రులను, సొంత ఊరిని మరోచోటికి వస్తుంది. ఈ విషయంలో ప్రపంచంలో ప్రతి స్త్రీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. భార్య గొప్పదనాన్ని గుర్తించిన ఓ భర్త ఎట్‌లీస్ట్ తన భార్య పుట్టిన రోజునైన ఏదైనా సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాడు. ఆమెకు పార్శిల్స్ అందుకోవడం అంటే ఇష్టం కావడంతో ఆ దిశగానే ఆలోచించాడు. అసలే ఫోటోగ్రాఫర్ కావడంతో సరికొత్త ఐడియాతో ముందుకు వెళ్లాడు. అచ్చం అమెజాన్ పార్శీల్ బాక్స్‌లా ఉండే కేకును సిద్ధం చేశారు. ఆ పైన అడ్రస్ కూడా యాజిటీజ్‌గా రాశాడు.

నిజంగానే అతని భార్య దాన్ని పార్శిల్ అనుకుంది. దగ్గరకు వెళ్లి చూసిన ఆమె.. అది పార్శిల్ కాదు, కేకని తెలుసుకుని ఆశ్చర్యపోయింది. భర్త ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు ఫిదా అయ్యింది. నార్త్ కరోలినాలో చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే..అమెరికాలో నివశించే  వేలాన్.. అతని భార్య ఎమిలీ మెక్‌గుయిర్‌కు ఆన్‌లైన్ షాపింగ్, పార్శిల్ అందుకోవడం అంటే చాలా ఇష్టం. దీంతో ఆమె పుట్టిన రోజుకు ఆన్‌లైన్‌లో గిఫ్ట్ బుక్ చేయాలని భావించాడు. అది రొటీన్‌గా ఉంటుందని భావించి ‘స్వీట్ డ్రీమ్స్ బేకరీ’కి వెళ్లి తన ఐడియా చెప్పాడు. బేకర్స్ కూడా అతను చెప్పినట్టుగానే అమెజాన్ పార్శిల్ తరహాలో కేకు తయారు చేశారు. నిజంగానే పార్శిల్ అనుకున్న భార్య..కేక్‌ను చూడగానే పుల్ సర్‌ఫ్రైజ్ అయ్యింది.  ఆ కేకు ఫొటోలను ఎమిలీ ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి.