Viral: భార్యతో విదేశాలకు లాంగ్ ట్రిప్ చెక్కేశాడు.. కట్ చేస్తే.. ఇంటికొచ్చేసరికి ఫ్యూజులౌట్.!

|

Apr 20, 2024 | 1:37 PM

ఓ వ్యక్తి తన భార్యతో కలిసి విదేశాలకు లాంగ్ ట్రిప్‌కి వెళ్లి వచ్చాడు. కట్ చేస్తే.. అతడు ఇంటికొచ్చేసరికి దెబ్బకు ఆ భార్యాభర్తలు ఇద్దరికీ మైండ్ బ్లాంక్ అయింది. ఇక చేసేదేమీలేక అంత బిల్లు కట్టలేమంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకెళ్తే..

Viral: భార్యతో విదేశాలకు లాంగ్ ట్రిప్ చెక్కేశాడు.. కట్ చేస్తే.. ఇంటికొచ్చేసరికి ఫ్యూజులౌట్.!
Representative Image
Follow us on

ఓ వ్యక్తి తన భార్యతో కలిసి విదేశాలకు లాంగ్ ట్రిప్‌కి వెళ్లి వచ్చాడు. కట్ చేస్తే.. అతడు ఇంటికొచ్చేసరికి దెబ్బకు ఆ భార్యాభర్తలు ఇద్దరికీ మైండ్ బ్లాంక్ అయింది. ఇక చేసేదేమీలేక అంత బిల్లు కట్టలేమంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకెళ్తే.. రెనే, అతడి భార్య ఫ్లోరిడాలో నివాసముంటున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో తమ స్వస్థలమైన స్విట్జర్లాండ్‌కు లాంగ్ ట్రిప్‌కి వెళ్లారు. ఇక ఈ టూర్‌కి ముందుగానే తన మొబైల్ సర్వీస్ అయిన టీ-మొబైల్‌కి ట్రిప్‌కి సంబంధించిన వివరాలు అందించాడు. కట్ చేస్తే.. స్విట్జర్లాండ్ వెళ్లారు. భార్యతో కలిసి తెగ ఎంజాయ్ చేశాడు. వివిధ అద్భుతమైన లోకేషన్లలో ఆమెతో కలిసి ఫోటోలు దిగాడు. వాటినన్నింటిని తన ఫ్రెండ్స్, బంధువులకు షేర్ చేశాడు. ఇక టూర్ ముగిసి.. ఇంటికి చేరుకోగానే ఆ జంటకు దిమ్మతిరిగింది. ఫోన్ బిల్లు ఏకంగా రూ. 1.2 కోట్లు వచ్చింది.

అయితే తాను టూర్‌కి వెళ్లేముందే సదరు సర్వీస్ ప్రొవైడర్‌కు ట్రిప్ డీటాయిల్స్, ఇంటర్నేషనల్ రోమింగ్ గురించి చెప్పానని.. ఇంత మొత్తంలో బిల్లు వేయడం సరికాదని వోపయాడు రెనే.. అంతకకుండా తన తప్పు ఏమి లేకపోవడంతో.. సంస్థపై న్యాయపోరాటానికి కూడా దిగాడు. దీని మేరకు లాయర్ నోటిసులు కూడా పంపించాడు. కట్ చేస్తే.. సదరు సంస్థ చాలా రోజులు మౌనం వహించి.. ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇలా జరిగిందని.. రెనే బిల్లు మొత్తం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే చివర్లో సదరు సంస్థ విదేశీ టూర్లకు వెళ్లేవారు.. ఇంటర్నేషనల్ రోమింగ్ ఫీచర్ యాక్టివ్ చేసుకోవాలని.. లేదంటే బిల్లు తడిసిమోపెడవుతుందని హెచ్చరించింది.