ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా సంచలనంగా మారిన ఉర్ఫీ జావేద్ తెలియని వారు ఎవరుంటారు..? తాను చేసే పని కంటే.. ధరించే బట్టల కారణంగానే చర్చలలో నిలుస్తుంటుంది ఈ నటి. మరోవైపు, రచయిత చేతన్ భగత్ కూడా తన ప్రకటనల కారణంగా తరచుగా వివాదాల్లో చిక్కుకోవడం మనం గమనిస్తూనే ఉంటాం. ఆ క్రమంలోనే.. ఉర్ఫీ జావేద్‌ను చేతన్ లక్ష్యంగా చేసుకుని, ఆమె యువతను పాడుచేస్తోందని ఆరోపించాడు. ఓ కార్యక్రమంలో చేతన్ భగత్ మాట్లాడుతూ.. ఉర్ఫీ దుస్తులపై తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ మాటలను విన్న ఉర్ఫీ ప్రతిస్పందించారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో చేతన్ భగత్ యువత గురించి మాట్లాడుతూ ‘‘ఉర్ఫీ చిత్రాలను యువత ఇష్టపడుతున్నారు. ఇది ఉర్ఫీ తప్పు కాదు, ఆమె తన వృత్తిని మాత్రమే చేసుకుంటోంది. పడుకున్న తర్వాత కూడా యువత ఆమె ఫోటోలను చూస్తున్నారు’’ అని అన్నారు.
ఉర్ఫీ జావేద్ గురించి చేతన్ భగత్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో ఉర్ఫీ జావేద్ ఆయన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఉర్ఫీ చేతన్ కోసం ఉర్ఫీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో..‘‘మీ అనారోగ్య ధోరణిని ప్రోత్సహించడం ఆపండి. పురుషుల ప్రవర్తనకు మహిళలను బాధ్యులను చేయడం అనే దుర్గుణం 80ల నాటి మిస్టర్ చేతన్ భగత్‌గా మారింది ఇప్పుడు. మీ వయసులో సగం మంది మగవాళ్లు.. అమ్మాయిలకు మెసేజ్‌లు పంపినప్పుడు మిమ్మల్ని తప్పుదారి పట్టించింది ఎవరు..? ఎల్లప్పుడూ స్త్రీల వైపు వేళ్లు చూపుతూ ఉండకండి.
నేను కాదు కానీ మీలాంటి వాళ్లు యువతను పాడు చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు అబ్బాయిలకు తమ తప్పులను స్త్రీలపై, వారి బట్టలపై ఎలా నిందించాలో నేర్పుతున్నారు’’ అని రాసుకొచ్చింది. ఇదే కాకుండా, చేతన్ భగత్‌తో ఉర్ఫీ చేసిన చాట్ స్క్రీన్‌షాట్‌లను కూడా ఆమె తన ఇన్స్‌స్టాలో షేర్ చేసింది. ఆ స్క్రీన్‌షాట్‌లలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను మనందరం చూడవచ్చు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..