Viral News: ఆన్సర్‌ షీట్‌లో ‘జై శ్రీరామ్‌’ నినాదాలు, క్రికెటర్ల పేర్లు.. తర్వాత ఏం జరిగిందంటే..

|

Apr 27, 2024 | 7:06 AM

వివరాల్లోకి వెళితే.. యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తర్వాత విచారణలో తేలింది. అందుకే క్రికెటర్ల పేర్లు, శ్రీరామ్‌ నినాదాలు రాసినా పాస్‌ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే విచారణ చేపట్టిన అధికారులు ఇద్దరు ప్రొఫెసర్లను సస్పెండ్ చేశారు. యూనివర్సిటీలోని కొందరు అధికారుల అండతో...

Viral News: ఆన్సర్‌ షీట్‌లో జై శ్రీరామ్‌ నినాదాలు, క్రికెటర్ల పేర్లు.. తర్వాత ఏం జరిగిందంటే..
Viral News
Follow us on

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఇటీవల యూపీ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో కొందరు వ్యక్తులు ప్రశ్నా పత్రాల్లో జై శ్రీరామ్‌ నినాదాలతో పాటు, క్రికెటర్ల పేర్లను రాశారు. విచిత్రమైన విషయం ఏంటంటే సదరు విద్యార్థులు 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు కావడం. అయితే ఈ విషయం ఎక్కువ సేపు దాగలేదు. అసలు విషయం బయటపడింది.

వివరాల్లోకి వెళితే.. యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తర్వాత విచారణలో తేలింది. అందుకే క్రికెటర్ల పేర్లు, శ్రీరామ్‌ నినాదాలు రాసినా పాస్‌ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే విచారణ చేపట్టిన అధికారులు ఇద్దరు ప్రొఫెసర్లను సస్పెండ్ చేశారు. యూనివర్సిటీలోని కొందరు అధికారుల అండతో సున్నా మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా 60 శాతానికి పైగా మార్కులతో ఉత్తీర్ణులయ్యారి విద్యార్థి నాయకుడు దివ్యాంశు సింగ్ ప్రధాని, ముఖ్యమంత్రి, గవర్నర్, వైస్ ఛాన్సలర్‌లకు లేఖరాశారు.

దీంతో ఆర్‌టీఐ స్పందించి జవాబు పత్రాలను రీవ్యాల్యుయేషన్‌ చేయించడంతో అసలు విషయం కాస్త బయటపడింది. ఈ విషయమై వర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ వందనా సింగ్ మాట్లాడుతూ.. విద్యార్థులు అక్రమ మార్గంలో ఉత్తీర్ణత సాధించారన్న విషయం తెలుసుకొని, ఒక కమిటీని ఏర్పాటు చేశాము. ఆ కమిటీ తన నివేదికలో విద్యార్థులకు ఎక్కువ మార్కులు కేటాయించినట్లు పేర్కొందని చెప్పుకొచ్చారు. ఇలాంటివి మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ప్రస్తుతం శైశ్రీరామ్‌ నినాదాలతో ఉన్న ఆన్సర్‌ పేపర్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..