Viral Video: ఆ యువకుడ్ని పట్టి పీడిస్తున్న పాము.. వెంటాడుతూ.. కాటేస్తూ..

|

Nov 16, 2024 | 7:01 PM

పాము పగ పట్టదు అంటారు.. మరి ఇదేంటి.. ఆ యువకుడ్ని అదే పనిగా అటాక్ చేస్తోంది. దీంతో భయపడి దాన్ని పట్టి చాలా దూరంలో విడిచి పెట్టి వచ్చినా మళ్లీ ఆ యువకుడ్ని వెంటాడి కాటేసింది.

Viral Video: ఆ యువకుడ్ని పట్టి పీడిస్తున్న పాము.. వెంటాడుతూ.. కాటేస్తూ..
Snake
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌, బద్‌గావ్‌ ప్రాంతంలో ఓ యువకుడు వరుస రోజుల్లో పలుసార్లు పాము కాటుకు గురయ్యాడు. పామును బంధించేందుకు స్నేక్ క్యాచర్‌ని పిలవగా… అది అతనిపై కూడా అగ్రెసీవ్‌గా దూసుకువచ్చి కాటు వేసింది. ఈ విచిత్రమైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో గ్రామం మొత్తం భయాందోళనకు గురవుతోంది. ఈ పాము గురించి స్థానికంగా విస్తృత చర్చ జరుగుతుంది.

కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. చిరావు గ్రామానికి చెందిన చరణ్‌సింగ్‌ కుమారుడు గౌరవ్‌ను గత కొన్ని రోజులుగా పాము వెంబడిస్తోంది. ఆ స్నేక్ మొదట గౌరవ్ ఇంటి సమీపంలో కనిపించింది.  ఆ తర్వాత అతను పొలానికి వెళ్లిన క్రమంలో అక్కడ మూడుసార్లు కాటు వేసింది. కరిచినప్పుడల్లా అతనికి వైద్య చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పుతుంది.  అదే పనిగా పాము అటాక్ చేస్తుండటంతో.. ఆందోళన చెందిన కుటుంబీకులు దానిని పట్టుకునేందుకు స్నేక్‌ క్యాచర్‌కు ఫోన్ చేశారు.

ఆ పామును స్నేక్ క్యాచర్ చాకచక్యంగా బంధించాడు. అది ఆడ పాము అని.. మంచి వయసు మీద ఉందని గుర్తించాడు. దానిని విడుదల చేయడానికి హిండన్ నదికి తీసుకెళ్లాడు. కాని పాము సమీపంలోని పొదల్లోకి తప్పించుకునే ముందు అతన్ని కూడా కాటు వేసింది. పాముకాటుకు అతను తనకు తానే స్వయంగా వైద్యం చేయించుకున్నాడు. కానీ అలా చేయడం చాలా డేంజర్. అయితే ఇక్కడే మరో ట్విస్ట్.. పామును చాలా దూరంలో వదిలేశారు ఇక రాదులే అనుకుంటే… మరుసటి రోజు, గౌరవ్ పొలాలకు నీరు పెడుతుండగా, పాము మళ్లీ కనిపించి అతనిని కాటు వేసింది. గౌరవ్ కుటుంబీకులు అతన్ని చికిత్స కోసం డాక్టర్ వద్దకు తరలించారు. అంతే కాకుండా భయంతో…  స్థానిక భూతవైద్యుల సహాయం కూడా కోరారు.

పదే పదే పాము గౌరవ్‌ను అటాక్ చేయడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు.ఈ ఘటన మండలంలో చర్చనీయాంశంగా మారింది. గౌరవ్ కుటుంబీకులతో పాటు గ్రామస్థులు గందరగోళ స్థితిలో ఉన్నారు. పాము అతన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటుందో అర్థం చేసుకోవడానికి రకరకాల మార్గాలను అన్వేశిస్తున్నారు.

 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..