Viral News: పోలీస్‌ స్టేషనల్‌లో విచిత్ర పంచాయతీ.. చిలుకమ్మ పలుకుతో తెగిన చిక్కుముడి..

|

Dec 19, 2022 | 3:06 PM

ఇదో విచిత్ర పంచాయతీ. గతంలో ఎవరూ ఎక్కడ చూడనిది. పోలీసులకే ముచ్చెమటలు పట్టించారు ఇద్దరు మహిళలు. చివరకు పంజరంలోని చిలుకమ్మ పలుకలతో పంచాయతీ చిక్కుముడి పటాపంచలైంది.

Viral News: పోలీస్‌ స్టేషనల్‌లో విచిత్ర పంచాయతీ.. చిలుకమ్మ పలుకుతో తెగిన చిక్కుముడి..
Up Parrot
Follow us on

పోలీస్ స్టేషన్లలో ప్రజల పంచాయితీలు మీరు చాలానే విని ఉంటారు. చూసి ఉంటారు కూడా. కానీ, సంగం నగరం ప్రయాగ్‌రాజ్‌లో ఓ విచిత్రమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. తప్పిపోయిన చిలుక కోసం పోలీసు స్టేషన్‌ చేరిన పంచాయితీ 2 గంటల పాటు కొనసాగింది. జిల్లాలోని శంకర్‌గఢ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ పంచాయతీ జరిగింది. భాదివార్ గ్రామానికి చెందిన బూటీ అనే బాలిక 112కి ఫోన్ చేసి రెండేళ్లుగా తన చిలుక (తోతారం) కనిపించడం లేదని పోలీసులకు సమాచారం అందించింది. గ్రామానికి చెందిన మరో మహిళ తమ చిలుకను బంధించి తన వద్దే పెట్టుకుందని ఆరోపించింది. చివరకు చిలుక దొరికిందని పోలీసులు దాని అసలు యజమానికి అప్పగించారు. ఈ విశిష్ట పంచాయితీ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే..బాలిక సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల వాదనలు వినిపించారు. కానీ ఆ చిలుకను తమది అని చెప్పడానికి ఇరువైపుల ప్రజలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీనిపై పోలీసులు ఇరువర్గాలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. చిలుక గురించి ఇద్దరు మహిళల నుంచి పోలీసులు సమాచారం తీసుకున్నారు. అదే సమయంలో, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మహిళ తన చిలుక 2 సంవత్సరాల క్రితం పారిపోయిందని చెప్పింది. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదని చెప్పింది. అయితే ఆ చిలుక గ్రామంలోనే ఉందని, గ్రామానికి చెందిన ఓ మహిళ దానిని దాచిపెట్టిందని ఆ తర్వాత తెలిసింది. అడిగిన తర్వాత కూడా ఆ మహిళ చిలుకను తిరిగి ఇవ్వలేదని ఆరోపించింది. అంతేకాదు, చిలుక తన పేరు పలుకుతుందని ఫిర్యాదు చేసిన బాలిక చెప్పింది. మరోవైపు తాను ఆ చిలుకను ఐదేళ్లుగా పెంచుకుంటున్నానని మరో మహిళ పోలీసులకు తెలిపింది.

పోలీస్ స్టేషన్‌ వచ్చిన ఇద్దరు మహిళలతో పాటు పంజరంలోని చిలుకను కూడా తీసుకొచ్చారు. ఇరువురి వాదనలు విన్న పోలీసులు బోను తెరిచి చిలుకను బయటకు వదిలారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ, చిలుక అమ్మా నాన్న అంటూ తన అసలు యజమానికి వద్దకు వెళ్లింది. దీంతో పోలీసులు చిలుక అసలు యజమాని అని భావించి ఫిర్యాదు దారుడికి అప్పగించారు. అయితే, ఈ చిలుక పంచాయతీ కాస్త ఆ నోట ఈ నోట పడటంతో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి