Viral: నడక, నడత తేడాగా ఉండటంతో బుర్ఖాలో ఉన్న మహిళను ఆపిన గ్రామస్తులు.. ఫేస్ చూసి ఫ్యూజులు ఔట్

|

Aug 19, 2022 | 12:58 PM

కాస్త క్రియేటివ్‌గానే ఆలోచించారు... కానీ ప్లాన్‌ను ఎగ్జాట్‌గా అమలు చేయలేకపోయారు. చివరి నిమిషంలో అసలుకే మోసం వచ్చింది. ఆ ఇంట్రస్టింగ్ కథనం మీ కోసం.

Viral: నడక, నడత తేడాగా ఉండటంతో బుర్ఖాలో ఉన్న మహిళను ఆపిన గ్రామస్తులు.. ఫేస్ చూసి ఫ్యూజులు ఔట్
Man Wears Burqa(Representative image)
Follow us on

Trending: అతడు తన సమీప గ్రామానికే చెందిన యువతితో ఘాడమైన ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో ఉద్యోగం కోసం సిటీకి వెళ్లాల్సి రావడంతో.. మళ్లీ ఎప్పుడు కుదురుతుందో ఏమో అని…  ఆమెను చూడాలనుకున్నాడు. కలిసి.. ప్రేమ ఊసులు చెప్పాలనుకున్నాడు. యధావిధిగా ఆ ఊరికి వెళ్తే అందరూ అతడిని గుర్తుపడతారు. అందుకే ఎవరూ గుర్తుపట్టకూడదని.. బురఖా ధరించి వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌(uttar pradesh)లోని షాజహాన్‌పూర్‌‌కి చెందిన సైఫ్ అలీ.. మెహమ్ముద్‌పూర్‌కి  చెందిన ఓ యువతితో గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. అడపాదడపా వీరు కలుసుకునేవారు. తాజాగా అలీకి కొత్త ఉద్యోగం వచ్చింది. దీంతో ఊరు విడిచి వెళ్లాల్సిన పరిస్థితి. పదే.. పదే ప్రేయసిని కలవడానికి వీలుపడదు. ఈ క్రమంలోనే పట్నం వెళ్లేముందు ఆమెను కలవాలనుకున్నాడు. ఎవ్వరికీ డౌట్ రాకుండా ఉండేందుకు బురఖా ధరించి ఆమె గ్రామానికి వెళ్లాడు. అయితే సైఫ్ అలీ నడక, వ్యవహారశైలి కాస్త చిత్రంగా ఉండటంతో గ్రామస్తులు అతడిని ఆపారు. ఒకసారి ముఖం చూపించాలని కోరారు. ఇంకేముంది బాగోతం బయటపడింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్‌కి చేరుకున్న కాప్స్.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ జంట నాలుగేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ప్రియడికి బురఖా ధరించి రావాలని ప్రేయసే సలహా ఇచ్చిందని పోలీసులు తెలిపారు. అతడిపై breach of peace కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి