Ukrainian Couple Marry At Frontline: రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. 12 రోజుల నుంచి రష్యా నిరంతర దాడులతో ఉక్రెయిన్ విలవిలలాడుతోంది. ఈ క్రమంలో ఎక్కడ చూసినా.. భీతావహ పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి యుద్ధ వాతావరణ పరిస్థితుల్లోనే ఓ జంట.. ఒక్కటైయింది. యుద్ధం ఏమాత్రం తమ పెళ్లికి ఆటంకం కాదంటూ.. రణ క్షేత్రంలోనే ఓ ప్రేమ జంట పెళ్లి చేసుకున్నారు. అది కూడా ఆర్మీ దుస్తుల్లోనే ఒక్కటయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని చూసి నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. యుద్ధం సైతం ప్రేమికులను విడదీయలేదంటూ పేర్కొంటున్నారు. ఈ పెళ్లి ఆదివారం జరిగింది.
ఉక్రెయిన్లోని కీవ్‌లో రష్యా సైనికులతో పోరాడుతున్న 112 బ్రిగేడ్‌కు చెందిన సైనికులు లెసియా, వాలెరీ ఫైలిమోనివ్ రణ క్షేత్రంలోనే వివాహం చేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట.. కాల్పుల మోత మధ్య ఒక్కటయ్యారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత వీరిద్దరూ కలుసుకోలేదని.. పెళ్లికి ముందు కలుసుకున్నట్లు సైనికులు పేర్కొన్నారు.
వైరల్ వీడియో..
This couple, Lesya and Valeriy, just got married next to the frontline in Kyiv. They are with the territorial defense. pic.twitter.com/S6Z8mGpxx9
— Paul Ronzheimer (@ronzheimer) March 6, 2022
టెరిటోరియల్ డిఫెన్స్ ఫోర్స్‌లో వాలంటీర్‌గా ఉన్న సుప్రసిద్ధ ఉక్రేనియన్ కళాకారుడు తారస్ కొంపనిచెంకో గిటార్ కూడా వాయిస్తూ కనిపించారు. కైవ్ నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని కవర్ చేసే జర్మన్ వార్ రిపోర్టర్ పాల్ రాన్‌జీమర్ ఈ వీడియోను షేర్ చేయగా.. ఈ వీడియో వైరల్ అయింది.
Also Read: