183 మంది ఉద్యోగం కోసం దరఖాస్తు.. 177 మందిని తిరస్కరించిన బాస్.. రీజన్ ఏమిటంటే

|

Mar 12, 2024 | 12:25 PM

UK కంపెనీ ఒక పోస్ట్ భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.ఈ అప్లికేషన్‌తో పాటు కంపెనీ కొన్ని ప్రశ్నలను కూడా అడిగారు.. దరఖాస్తుదారులు దరఖాస్తుతో పాటు ఈ ప్రశ్నలకు సమాధానాలు పంపాలి అని కండిషన్ పెట్టింది. అయితే మొత్తం 183 దరఖాస్తులలో 177 తిరస్కరించారు. దీనికి కారణం ఓ సాధారణ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. కంపెనీ అడిగిన ప్రశ్నలను కూడా పట్టించుకోలేదు. ఉద్యోగం సంపాదించాలనే రేసులో ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏమిటో ఆలోచించలేకపోయారు.

183 మంది ఉద్యోగం కోసం దరఖాస్తు.. 177 మందిని తిరస్కరించిన బాస్.. రీజన్ ఏమిటంటే
Uk Company Boss Decline 177 Applications
Image Credit source: Pixabay
Follow us on

మనసుకు నచ్చిన.. మెచ్చిన ఉద్యోగం దొరకడం అంత సులువు కాదు. ఎందుకంటే చాలా కంపెనీలలో మంచి జీతం వస్తుంది అయితే ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉండవు. సౌకర్యాలు ఉంటే జీతం మీ కోరిక మేరకు ఉండదు. అంతేకాదు జీతం, సౌకర్యాలు ఉంటే ఎక్కువ కాలం పని చేసేందుకు వాతావరణం అనుకూలించక పోవడం, అంతా బాగానే ఉన్న చోట ఖాళీ లేకపోవడం, వచ్చినా వందలాది మంది ఉండడం కూడా కొన్నిసార్లు జరుగుతుంది. ఒక ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటారు.. అయితే కొందరి దరఖాస్తులు తిరస్కరణకు గురికాగా మరికొందరు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే ఈరోజుల్లో ఓ విచిత్రమైన కేసు వార్తల్లోకి ఎక్కి జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వాస్తవానికి UK కంపెనీ ఒక పోస్ట్ భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.ఈ అప్లికేషన్‌తో పాటు కంపెనీ కొన్ని ప్రశ్నలను కూడా అడిగారు.. దరఖాస్తుదారులు దరఖాస్తుతో పాటు ఈ ప్రశ్నలకు సమాధానాలు పంపాలి అని కండిషన్ పెట్టింది. అయితే మొత్తం 183 దరఖాస్తులలో 177 తిరస్కరించారు. దీనికి కారణం ఓ సాధారణ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. కంపెనీ అడిగిన ప్రశ్నలను కూడా పట్టించుకోలేదు. ఉద్యోగం సంపాదించాలనే రేసులో ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏమిటో ఆలోచించలేకపోయారు.

177 దరఖాస్తులను తిరస్కరించిన బాస్..

మిర్రర్ నివేదిక ప్రకారం కంపెనీ పేరు RIWeb. ఇది ఇంటర్నెట్ సేవల సంస్థ. కంపెనీ బాస్ ర్యాన్ ఇర్వింగ్. దరఖాస్తులను ఆహ్వానించింది ఆయనే. మొత్తం 183 మంది నుంచి దరఖాస్తులు అందాయని.. అందులో 177 దరఖాస్తులను తిరస్కరించినట్లు ర్యాన్ తెలిపారు. ప్రజలు చిన్న చిన్న విషయాలను పట్టించుకోనప్పుడు వారిని నియమించుకోవడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. ర్యాన్ ప్రకారం కేవలం 6 మంది మాత్రమే ఇంటర్వ్యూకి సెలక్ట్ అయ్యారు. వీరిలో ఎవరైనా ఎంపికయ్యారో లేదో చెప్పనప్పటికీ, దరఖాస్తుదారులు ఉద్యోగ ప్రకటనను సరిగ్గా చదవలేదని చెప్పారు.

ఇవి కూడా చదవండి

నెలకు లక్ష రూపాయలకు పైగా జీతం

ర్యాన్ లింక్డ్‌ఇన్‌పై తన నిరాశను వ్యక్తం చేశాడు. ఉద్యోగం కోసం 12 , 75000 రూపాయల వార్షిక ప్యాకేజీని ఇస్తున్నట్లు చెప్పాడు. ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసేటప్పుడు, కంపెనీ ఏమి అడుగుతోంది.. వారి నుంచి  ఏమి డిమాండ్ చేస్తుందో తెలుసుకోవడానికి కంపెనీ ఇచ్చే ప్రకటనలను జాగ్రత్తగా చదవాలని ఆయన ప్రజలకు సూచించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..