Kerala man: లాక్‌డౌన్‌లో సొంతంగా విమానాన్ని తయారు చేసుకున్నాడు.. ఇప్పుడు ఫ్యామిలీతో యూరప్‌ ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు..

|

Jul 27, 2022 | 4:24 PM

అశోక్ ఇంజనీరింగ్ చదివాడు. అతను ప్రస్తుతం ఫోర్డ్ మోటార్ కంపెనీలో ఇంజనీర్. సొంతంగా తయారు చేసిన ఈ విమానానికి తనపెద్ద కూతురు దియా పేరును ‘జి-దియా’ అని పెట్టాడు. అశోక్ ఎప్పటి నుంచో తన సొంత విమానం

Kerala man: లాక్‌డౌన్‌లో సొంతంగా విమానాన్ని తయారు చేసుకున్నాడు.. ఇప్పుడు ఫ్యామిలీతో యూరప్‌ ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు..
Kerala Man
Follow us on

Kerala man: లాక్‌డౌన్‌లో సొంతంగా విమానాన్ని తయారు చేసుకున్నాడు.. ఇప్పుడు ఫ్యామిలీతో యూరప్‌ ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు..
చాలా మందికి ప్రయాణం అంటే ఇష్టం. ఏటా దేశ విదేశాలకు పర్యటిస్తుంటారు. కానీ మీరు ఎప్పుడైనా విదేశాలకు వెళ్లి ఉంటే, విమాన టిక్కెట్ల ధర ఎంత ఉంటుందో మీకు తెలుస్తుంది. ఖరీదైన విమాన టిక్కెట్ల వల్ల ఇబ్బంది పడి కేరళకు చెందిన ఓ వ్యక్తి సొంతంగా విమానాన్ని తయారు చేశాడు. కరోనా లాక్‌డౌన్‌ కాలంలో అతను ఈ విమానాన్ని తయారు చేశాడు. తన కుటుంబంతో కలిసి ఇదే విమానంలో యూరప్‌ ట్రిప్‌ కూడా పూర్తి చేశాడు. అతడు ఎవరో కాదు..కేరన్ మాజీ ఎమ్మెల్యే ఏవీ తామరాక్షన్ కుమారుడు అశోక్ గురించి మాట్లాడుతున్నాం. అశోక్ స్వయంగా లాక్‌డౌన్‌లో 4 సీట్ల విమానాన్ని తయారు చేసి తన కుటుంబంతో కలిసి యూరప్‌కు వెళ్లాడు. ఈ విమానం తయారీకి దాదాపు 80 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు అశోక్ తెలిపారు. అశోక్ ఈ విమానాన్ని కేవలం ఏడాదిన్నర కాలంలో తయారు చేశారు. కరోనాలో ప్రపంచం మొత్తం ఇళ్లలో బంధించబడినప్పుడు అశోక్ ఈ విమానాన్ని సిద్ధం చేస్తున్నాడు.

మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. అశోక్ ఇంజనీరింగ్ చదివాడు. అతను ప్రస్తుతం ఫోర్డ్ మోటార్ కంపెనీలో ఇంజనీర్. సొంతంగా తయారు చేసిన ఈ విమానానికి తనపెద్ద కూతురు దియా పేరును ‘జి-దియా’ అని పెట్టాడు. అశోక్ ఎప్పటి నుంచో తన సొంత విమానం ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తద్వారా వారు ఎప్పుడు సంచరించాలనుకున్నా సులభంగా తిరుగుతారు. ఈ కలను నెరవేర్చుకునేందుకు అశోక్ తక్కువ ధరకే విమాన నమూనాను సిద్ధం చేయడం ప్రారంభించాడు. లాక్‌డౌన్ సమయంలో, అతను బ్రిటన్‌లోనే నాలుగు సీట్ల చిన్న విమానాన్ని తయారు చేయడం ప్రారంభించాడు.

ఇవి కూడా చదవండి

విమానం తయారీకి సంబంధించిన మెటీరియల్‌ను ఆఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నుంచి కొనుగోలు చేసినట్లు అశోక్ తెలిపారు. ఈ మెటీరియల్‌తో తన ఇంటిలోని ఓ భాగంలో వర్క్‌షాప్‌ను ప్రారంభించాడు. ఈ మొత్తం ప్రాజెక్ట్ UK పౌర విమానయాన శాఖ అధికారుల పర్యవేక్షణలో జరిగింది. ఈ విమానం గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు, విమానానికి గంటకు 20 లీటర్ల ఇంధనం అవసరం ఉంటుంది. అశోక్ తన భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి 2016లో లండన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.