ఓ ఇద్దరు వ్యక్తులు జేసీబీ వాహనం టైర్లలో గాలి నింపుతున్నారు. అంతా బాగానే ఉందనుకునేలోపు.. సడన్‌గా భారీ పేలుడు.. పక్కన ఉన్నవారు అసలేం జరిగిందని కళ్లు తుడుచుకుని చూసేసరికి ఎదురుగా షాకింగ్ సీన్ కనిపించింది. అంతే..
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని దావణగెరెలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇద్దరు వ్యక్తులు ట్రాక్టర్‌లో ఉన్న జేసీబీ టైర్లలో గాలి నింపుతుండగా.. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. అసలు అక్కడ ఏం జరిగిందో.. చుట్టుప్రక్కల వారికి కొద్దిసేపు అర్ధం కాలేదు. కళ్లు తుడుచుకుని చూసేసరికి ఎదురుగా షాకింగ్ సీన్ కనిపించింది. ఒక వ్యక్తి కిందపడి.. ముక్కుతూ.. మూలుగుతున్నాడు. ట్రాక్టర్‌లో ఉంచిన జేసీబీ టైర్‌కు గాలి ఎక్కిస్తుండగా ఈ ఘటన జరిగగా.. అది బరస్ట్ కావడంతో ఆ వ్యక్తి అంతెత్తున గాల్లో ఎగిరిపడ్డాడు. స్వల్ప గాయాలతో అతడు బయటపడ్డాడు. ఈ ప్రమాదం జూలై 3న జరిగినట్లు తెలుస్తోంది.