Viral: రన్‌వేపై విమానం ఉండగానే మరో ఫ్లైట్ టేకాఫ్.. రెప్పపాటులో..!

|

Dec 31, 2024 | 4:23 PM

ఇటీవల వరుస విమాన ప్రమాద ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తరచూ ఎక్కడో అక్కడ విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే దక్షిణ కొరియాలో జరిగిన విమాన ప్రమాదంలో వందమందికి పైగా మృతి చెందారు. అయితే అమెరికాలోని లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో ఓ విమాన ప్రమాదం తృటిలో తప్పింది.

Viral: రన్‌వేపై విమానం ఉండగానే మరో ఫ్లైట్ టేకాఫ్.. రెప్పపాటులో..!
Flights In Same Runway
Follow us on

ఇటీవల వరుస విమాన ప్రమాద ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తరచూ ఎక్కడో అక్కడ విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే దక్షిణ కొరియాలో జరిగిన విమాన ప్రమాదంలో వందమందికి పైగా మృతి చెందారు. అయితే అమెరికాలోని లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో ఓ విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఓ విమానం రన్‌వేపై ఉండగానే మరో విమానం టేకాఫ్ కావడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ భయపడి ‘స్టాప్, స్టాప్, స్టాప్’ అని పైలట్‌ను హెచ్చరించాడు.

వాషింగ్టన్‌కు చెందిన గోంజగ యూనివర్సిటీ మెన్స్ బాస్కెట్ బాల్ జట్టు ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్.. రన్‌వేపై ఉండగా ఈ ఘటన జరిగింది. వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు ప్రారంభించింది. లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ సమయంలో రన్‌వే నుంచి రెండో విమానం టేకాఫ్ అవుతుండడంతో రన్‌వేని దాటకుండా ఉండాలని బాస్కెట్ బాల్ జట్టు సభ్యులున్న ‘కీ లైమ్ ఎయిర్ ఫ్లైట్ 563’ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు ఆదేశించారు. అయితే, అదే సమయంలో ఎంబ్రేయర్ ఈ135 విమానం టేకాఫ్ కావడంతో అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ‘స్టాప్, స్టాప్, స్టాప్’ అని ప్రైవేట్ క్యారియర్‌ పైలట్‌ను హెచ్చరించాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మొదటి విమానం టేకాఫ్ అయిన తర్వాత కాసేపటికి ప్రైవేట్ జెట్ టేకాఫ్ అయింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..