Viral: లిఫ్ట్ కోసం నిలబడ్డ యువకుడు.. ఇంతలో వచ్చి ఆగిన ఓ కారు.. ఎక్కి కూర్చోగా మైండ్ బ్లాంక్!

|

Jul 05, 2022 | 9:22 PM

ఓ యువకుడు తన పని ముగించుకుని ఆఫీస్ నుంచి బయటికొచ్చే సరికి అర్ధరాత్రి అయింది. ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమో అని..

Viral: లిఫ్ట్ కోసం నిలబడ్డ యువకుడు.. ఇంతలో వచ్చి ఆగిన ఓ కారు.. ఎక్కి కూర్చోగా మైండ్ బ్లాంక్!
Representative Image
Follow us on

ఓ యువకుడు తన పని ముగించుకుని ఆఫీస్ నుంచి బయటికొచ్చే సరికి అర్ధరాత్రి అయింది. ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమో అని రోడ్డు ప్రక్కనే ఎదురు చూశాడు. ఈలోపు ఓ కారు వచ్చి అతడి ముందు ఆగింది. లిఫ్ట్ ఇస్తామని రమ్మన్నారు. సదరు యువకుడు కారులోకి ఎక్కి కూర్చోగా.. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఏం చేశారంటే..

వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని పుట్టి గ్రామానికి చెందిన అమీర్ సోమవారం తన పని ముగించుకుని బయటికొచ్చేసరికి అర్ధరాత్రి 2 గంటలు దాటింది. అతడు దుజానా అనే ప్రాంతంలో ఉండగా.. ఇంటికి బహదూర్‌గఢ్‌లోని సెక్టార్‌-2కి వెళ్ళాలి. ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమోనని రోడ్డు పక్కన నిల్చుని ఎదురు చూశాడు. ఈలోపు ఓ నల్ల రంగు శాంత్రో కారు వచ్చి అతడి దగ్గర ఆగింది. కారులో ఇద్దరు వ్యక్తులు ఉండగా.. వారు లిఫ్ట్ ఇస్తామంటూ అమీర్‌ను రమ్మన్నారు. అమీర్ కారు ఎక్కి కూర్చోన్నాడు.

కొంతదూరం వెళ్ళాక ఆ ఇద్దరు వ్యక్తులు గన్‌తో అమీర్‌ను బెదిరించారు. అతడి దగ్గర ఉన్న డబ్బును ఇవ్వాలని.. లేదంటే షూట్ చేస్తామని హెచ్చరించారు. దీనితో భయపడిన అమీర్.. వెంటనే కదులుతున్న కారు నుంచి దూకేశాడు. అయినా వదలని ఆగంతుకులు.. అతడ్ని వెంబడించి రూ. 15 వేలు లాక్కుని పరారయ్యారు. కాగా, అమీర్.. జరిగిన ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.