Two men funny video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా మరికొన్ని ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. అయితే.. కొందరి వీడియోలు చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటాం. కొందరు ట్రెండ్ అవ్వాలని వీడియోలు చేస్తుంటారు. మరికొందరు తెలియకుండానే వైరల్ అవుతారు. ఎందుకంటే.. వారి అమాయకత్వమో.. తెలియనితనమో.. ముర్ఖత్వమో కానీ.. వారు చేసే పనులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతాయి. తాజాగా ఇద్దరు పరమానందయ్య శిష్యుల్లా ప్రవర్తించారు. ప్రస్తుతానికి వారిద్దరికి చెందిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియా (Social Media) లో ఇది చూసి నెటిజన్లు అందరూ తెగ నవ్వుకుంటున్నారు. ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట అంటూ కామెంట్లు చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో.. చెట్టు వేర్వేరు కొమ్మలపై ఇద్దరు వ్యక్తులు కూర్చుని కనిపిస్తారు. అదే సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో భుబన్ బద్యాకర్ కచ్చా బాదం పాట కూడా ప్లే అవుతోంది. అయితే మరుసటి క్షణంలో ఏం జరుగుతుందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇద్దరు ఏదేదో మాట్లాడుకుంటూ.. ఒకరి కొమ్మను ఒకతను.. మరొకరి కొమ్మని ఇంకో అతను నరకడం ప్రారంభిస్తాడు. దీని తరువాత.. వారిద్దరూ మాట్లాడుకొని మళ్లీ అదేవిధంగా చేస్తారు. వీరిద్దరూ కూర్చుని ఉన్న చెట్టు కింద నది ప్రవహిస్తోంది. రెంటిలో ఏ కొమ్మ విరిగినా నేరుగా నదిలో పడతారు.
వైరల్ వీడియో..
అయితే ఈ ఇద్దరు వ్యక్తుల ఈ వింత పనికి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో Naturesfy అనే ఖాతా షేర్ చేసింది. ఇదేంది రా నాయనా ఇలా చేస్తున్నారంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: