
సాధారణంగా ఆడవాళ్లు కొట్టుకోవడం సర్వ సాధారణమైన విషయం. బస్సుల్లో, ట్రైన్లలో, మెట్రోలో ఎక్కడైనా సరే ఎక్కువగా లేడీస్ కొట్టుకుంటూ ఉంటారు. సాధ్యమైనంత వరకు ఇలాంటి గొడవలకు మగవాళ్లు దూరంగా ఉంటారు. ఇంట్లో ఏమో తెలీదు కానీ.. బయట మాత్రం అడ్జెస్ట్ అయిపోతారు. అయితే తాజాగా మెట్రోలో ఇద్దరు మగవాళ్లు కొట్టుకున్నారు. వీళ్లను చుట్టు పక్కల మగవాళ్లు విడదీయాల్సిన పరిస్థితి నెలకొంది అంటే వీరి గొడవ ఏ స్థాయికి చేరుకుందో చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య మెట్రో ట్రైన్లలో అసభ్యకరమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఇద్దరు మగవాళ్లు కొట్టుకోవడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఢిల్లీ మెట్రో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏదో విధంగా నిత్యం ఢిల్లీ మెట్రోకి సంబంధించిన ఘటనలు వార్తల్లో నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ మెట్రోల్ అసభ్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని పక్కన ఉన్నవారు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. తాజాగా బెంగళూరు మెట్రోలో ఇద్దరు మగవాళ్లు గొడవలకు దిగారు.
అసలు వీరిద్దరి మధ్య గొడవకు గల కారణం తెలియ రాలేదు. కానీ తోటి ప్రయాణికులు కలుగజేసుకునే వరకు వీరి గొడవ వెళ్లింది. వీరు కొట్టుకున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో X @chrisinMPలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో జోరుగా వైరల్ అవుతుంది. నెటిజన్లు ఈ వీడియోపై భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ వీడియో మీరు కూడా చూసేయండి.
A fight broke out between two passengers inside an overcrowded Metro train in Bengaluru.
BMRCL is reviewing the video & investigating further details@OfficialBMRCL pic.twitter.com/x7uwMVqAfs
— ChristinMathewPhilip (@ChristinMP_) July 9, 2024