Viral Video: వామ్మో.. వాయమ్మో.. ప్రియుడి కోసం ఇద్దరమ్మాయిల గ్యాంగ్ వార్.. నెట్టింట ట్రెండింగ్!

|

Jul 15, 2022 | 12:06 PM

ఓ అరుదైన ఘటన.. అప్పుడప్పుడూ ఇలాంటివి చూసి ఉంటారు. సాధారణంగా గర్ల్‌ఫ్రెండ్ కోసం ఇద్దరబ్బాయిలు..

Viral Video: వామ్మో.. వాయమ్మో.. ప్రియుడి కోసం ఇద్దరమ్మాయిల గ్యాంగ్ వార్.. నెట్టింట ట్రెండింగ్!
Girls Fight On Road
Follow us on

ఓ అరుదైన ఘటన.. అప్పుడప్పుడూ ఇలాంటివి చూసి ఉంటారు. సాధారణంగా గర్ల్‌ఫ్రెండ్ కోసం ఇద్దరబ్బాయిలు కొట్టుకోవడం చూసే ఉంటారు. కాని మీరెప్పుడైనా బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరమ్మాయిలు ఒకరిపై ఒకరు గ్యాంగ్ వార్‌కు దిగడం చూశారా.? ఇక్కడ పట్టుమని పదహారేళ్లు కూడా నిండని ఇద్దరమ్మాయిలు తమ స్నేహితురాళ్లతో రోడ్డుపై తన్నులాటకు దిగారు. ఓ చిన్న సైజ్ యుద్దాన్ని తలపించారు.

ప్రియుడి విషయంలో ఇద్దరమ్మాయిల మధ్య చిన్న గొడవ తలెత్తింది. దీంతో రోడ్డుపై ఆ ఇద్దరూ ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకుంటూ నానా హంగామా చేశారు. కాసేపటికి ఆ ఇద్దరి అమ్మాయిల స్నేహితురాళ్లు కూడా తోడవ్వడంతో.. అది కాస్తా గ్యాంగ్ వార్‌గా మారింది. ఒకరినొకరు తన్నుకుంటూ.. కర్రలతో కొట్టుకుంటూ.. పిడిగుద్దుల వర్షం కురిపించారు. వీళ్ల హంగామాతో విసుగెత్తిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు స్పాట్‌కు చేరుకునేసరికి ఆ రెండు గ్యాంగ్‌ల అమ్మాయిలు అక్కడ నుంచి గప్‌చుప్‌గా పరారయ్యారు. కాగా, ప్రస్తుతం ఈ అమ్మాయిల ఫైట్ మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం…