పాములకు సంబంధించిన వీడియోలు , ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. నెటిజన్లు కూడా ఇలాంటి వీడియోలపై ఆసక్తి చూపుతూ ఉంటారు. మాములుగా పాములను చూస్తేనే భయంతోవణికిపోతాం. అదే ఎదురుగా కళ్ళముందు ఉంటే ఇంకేమైనా ఉందా పై ప్రాణాలు పైనే పోతాయి. మనం పాములుకు సంబంధించిన చాలా రకాల వీడియోలు చూస్తూ ఉంటాం. మనం ఇంట్లో దాక్కున్నా సాంగ్స్ చూశాం.. కారులో ప్రత్యక్షమైన పాములను చూశాం.. బైక్ లో నక్కిన పాములను కూడా చూశాం. ఇక ఇప్పుడు వైరల్ అవుతోన్న వీడియో కూడా అలాంటిదే..
ఈసారి వైరల్ అవుతున్న వీడియోలో ఒకటి కాదు.. రెండు నాగుపాములను చూడొచ్చు. రెండు పాములు దర్జాగా సైకిల్ మీద కూర్చున్నాయి. సైకిల్‌పై నాగుపాములు కూర్చుని ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుసలు కొడుతోన్న ఆ నాగులను చూస్తే వెన్నులో వణుకు పుట్టక మానదు.
నాగ్-నాగిని జోడీ అని అనిపిస్తుంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ పేజీ _goga_ni_daya_ ద్వారా షేర్ చేయబడింది. ఈ వీడియోకి ఇప్పటి వరకు పదహారు వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అలాగే వీడియోకు 385k వీక్షణలు , కామెంట్స్ వచ్చాయి. హడలెత్తించే వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.