Viral: పర్యాటక కేంద్రంలో స్వేచ్ఛగా హల్‌చల్ చేస్తున్న చిరుతలు.. వైరల్‌గా మారిన వీడియో..
సుందరమైన హిల్ స్టేషన్‌కు మకుటం లేని మారాజు లాంటిది ఊటీ.. అలాంటి ఊటీకి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో రెండు బ్లాంక్..

ఊటీ..తమిళనాడులోని నీలగిరి పర్వతాలలో ఉన్న ప్రసిద్ధి పర్యాటక కేంద్రం. ఎటు చూసినా పచ్చదనమే ఆవరించి ఉండడంతో ఎంతటివారైనా మంత్రముగ్ధులు కావలసిందే దాని అందాలకి. సుందరమైన హిల్ స్టేషన్‌కు మకుటం లేని మారాజు లాంటిది ఊటీ.. అలాంటి ఊటీకి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో రెండు బ్లాంక్ పాంథర్లు స్వేచ్ఛగా హల్‌చల్ చేస్తూ తిరుగుతున్నాయి. ఈ వీడియో ఊటీలోని వాతావరణ పరిశోధన కేంద్రంలో జరిగినది కావడంతో నెటిజన్లు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వాతావరణ కేంద్రంలోని సీసీ కెమెరాలలో రికార్డయింది. ‘‘ఊటీలోని వాతావరణ పరిశోధన కేంద్రం ఆవరణలో రెండు బ్లాంక్ పాంథర్‌లు సంచరిస్తున్నాయి’’ కాప్షన్‌తో కిషోర్ చంద్రన్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను మొదటగా నెట్టింట షేర్ చేశాడు. దీనిని ఇప్పటికే 22 వేల మంది వీక్షణలు వచ్చాయి. అయితే ఈ వీడియోలో మొత్తం నాలుగు పాంథర్‌లు ఉన్నట్లు నెటిజన్లు అనుమానిస్తున్నారు. ’’నేను వీడియోలో నాలుగు జంతువులను చూశాను. అదనంగా కనిపించిన రెండు జంతువుల రంగు, అక్కడ చీకటిగా ఉండడంతో సరిగా గుర్తించలేకపోయాను. కానీ జంతువుల కళ్లలో కాంతి పడి అవి కనిపించాయి. అయితే మిగిలిన రెండు బ్లాక్ పాంథర్‌లను మనం వీడియోలో నేరుగా చూడవచ్చ’’ని ఓ నెటిజన్ తన స్పందనను రాసుకొచ్చాడు. మరో నెటిజన్ కూడా ఇలాగే స్పందించడంతో పాటు.. ‘అక్కడ నాలుగు చిరుతలు ఉన్నాయి. రెండు సహజమైనవి, రెండు నల్లనివి. అవి కెమెరాను చూసినప్పుడు వాటి కళ్లల్లో కాంతి పడి మెరుస్తున్నాయి’ అని కామెంట్ చేశాడు.
two Black Panthers spotted roaming inside the campus of Meteorological Research Centre, Ooty, Nilgiris. pic.twitter.com/7vn7YTcbwU
— Kishore Chandran?? (@Kishore36451190) November 13, 2022
ఇదే తరహాలో ఒక చిరుత పులి ఉన్న వీడియో ఒకటి ఇటీవలి కాలంలో వైరల్ అయింది. ఆ వీడియోలో.. చిరుతపులి ఒక భవనం మీద నుంచి కిందకి దూకి.. బైక్ మీద వెళ్తున్న వ్యక్తిని దాడిచేసినట్లు ఉంటుంది. కాగా, బ్లాక్ పాంథర్ అనేది ఒక మెలనిస్టిక్ చిరుతపులి. అంటే మెలనిన్ ఎక్కువగా ఉన్న పెద్ద పిల్లి. పిగ్మెంటేషన్ కారణంగా వీటి చర్మం నల్లబడుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి