Turkish Chef: నస్రెట్ గోక్సే కొత్త ట్రెండ్‌.. డస్ట్‌బిన్‌ కవర్‌ను టీ షర్ట్‌గా ధరించి పావురాలకు ఆహారం..

|

Nov 02, 2021 | 3:24 PM

Turkish Chef Salt Bae: సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవడానికి కొందరు రకరకాల వీడియోలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. అవి చాలా వరకు అభిమానుల...

Turkish Chef: నస్రెట్ గోక్సే కొత్త ట్రెండ్‌.. డస్ట్‌బిన్‌ కవర్‌ను టీ షర్ట్‌గా ధరించి పావురాలకు ఆహారం..
Turkish Chef
Follow us on

Turkish Chef Salt Bae: సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవడానికి కొందరు రకరకాల వీడియోలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. అవి చాలా వరకు అభిమానుల మనసు గెలుచుకున్నా.. కొన్ని గందరగోళానికి గురిచేస్తాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. సాల్ట్ బేగా ప్రసిద్ధిగాంచిన టర్కిష్ చెఫ్‌ నస్రెట్ గోక్సే ఇప్పుడు సరికొత్త వీడియోతో ప్రజలను విస్మయానికే కాదు.. ఒకింత గందరగోళానికి గురి చేస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

ఆహారంపై ఉప్పు చల్లడం ,  నమ్మశక్యం రీతిలో కొలత కొలిచినట్లుగా..  ఖచ్చితంగా మాంసాన్ని కత్తిరించడం వంటి విన్యాసాల వీడియోతో ఫేమస్ అయిన టర్కిష్ చెఫ్ గుర్తున్నాడా.. అతనేనండీ.. సాల్ట్ బేగా ప్రసిద్ధి చెందిన నస్రెట్ గోక్సే మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాడు.  యునైటెడ్ కింగ్‌డమ్‌లోని అతని కొత్త రెస్టారెంట్ లో అధిక ధరలతో చర్చనీయాంశంగా మారిన తర్వాత.. ఇప్పుడు గోక్సే చెత్త బ్యాగ్‌ని దుస్తులుగా ధరించి పావురాలకు ఆహారం ఇస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం  ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.  అవును ఈ వీడియోలో చెఫ్‌ నస్రెట్‌ డస్ట్‌బిన్‌ కవర్‌ను టీ షర్ట్‌లా ధరించి, కింద ఒక షార్ట్‌ వేసుకుని వినూత్నరీతిలో కనిపిస్తున్నాడు. అంతేకాదు నస్రెట్‌ ఒక పార్క్‌లో ఉడుతలకు, పావురాలకు ఆహారం తినిపిస్తూ ప్రకృతితో మమేకమై ఉన్నట్లు కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో తోపాటుగా “ప్రకృతి ప్రేమికులు ఆనందంగా ఉంటారు” అనే క్యాప్షన్‌తో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో నెట్టింట ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. అంతేనా… నస్రెట్‌ ఎందుకలా చెత్త సంచిని టీషర్ట్ గా ధరించాడు అంటూ నెటిజన్లు పెద్ద చర్చకు తెర తీసారు. పైగా నస్రెట్‌ యునైటెడ్ కింగ్‌డమ్‌లోని తన రెస్టారెంట్‌లో ఉండే అధిక ధరల కారణంగా ఇలా వైరటీగా ధరించాడు కాబోలు అంటూ రకరకాలుగా ట్వీట్స్‌ చేస్తున్నారు. లక్షలమంది వీక్షిస్తున్న ఈ చెఫ్‌ న్యూట్రెండ్‌ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండి మరి

Also Read:  అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ని ఇంట్లోనే తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు.. సింపుల్ చిట్కాలు మీకోసం