ఇన్‌స్టా, ట్విట్టర్, ఫేస్‌బుక్, థ్రెడ్స్.. ఇలా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైనా కూడా.. వాటిల్లో ఎక్కడ చూసినా ఏదొక ఫోటో పజిల్ మీకు తారసపడే ఉంటుంది. ఇటీవల ఇంటర్నెట్‌లో ఇవే ట్రెండ్. ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. ఇవి రెండూ కూడా మన బుర్రతో బంతాట ఆడేస్తాయి. తమలో రహస్యాలను దాచుకున్న ఇలాంటి చిత్రాలు.. మీ మెదడుకు మేత వేయడమే కాదు.. మిమ్మల్ని ఎలప్పుడూ యాక్టివ్‌గా ఉంచుతాయి. పైపైన ఫోటోలను చూస్తే మీకేం కనిపించదు.. నిశితంగా చూసిన తర్వాతే మీకు సమాధానాలు కనిపిస్తాయ్. సాల్వ్ చేయగానే మీకు కిక్కే కిక్కు. అంతటి మజా ఇస్తాయి ఈ ఫోటో పజిల్స్. ఈ కోవలోనే తాజాగా ఓ ఫోటో పజిల్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? దాన్ని చూడగానే ఏదో కొండలాంటి ప్రదేశం అని ఈజీగా చెప్పేస్తారు. చుట్టూ చెట్లతో నిండిన ఆ ప్రాంతంలో ఓ గుర్రం దాగుంది. అది ఎంచక్కా ఈ పచ్చికబైర్లలో సేద తీరుతోంది. మీరు దాన్ని కనుగొనడం కొంచెం కష్టమే. అయితే కొంచెం నిశితంగా ఫోటోను పరిశీలిస్తే.. ఆన్సర్ చెప్పేయొచ్చు. కొన్ని సెకన్లలోనే మీరు గుర్రాన్ని కనిపెడితే మీ కంటి చూపుల్లో పదును ఉన్నట్టే. ఎంతసేపు చూసినా.. మీకు దొరక్కపోతే.. ఈ పజిల్ సాల్వ్ చేయడం మీ వల్ల కాకపోతే.. అప్పుడు ఆన్సర్ కోసం కింద ఫోటో చూడండి.