AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: పులి దాడి వీడియోను షేర్ చేసిన ట్రంప్..బాధితుడి కుటుంబం ఆవేదన!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేర్ చేసిన ఓ ఏఐ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆ వీడియోలో ట్రంప్ ఓ పులితో కుస్తీ పడుతూ, నవ్వుతూ దాన్ని కౌగిలించుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, బ్రిటన్‌లో నిజంగా జరిగిన పులి దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజులకే ట్రంప్ ఈ వీడియోను షేర్ చేయడం వివాదాస్పదంగా మారింది.

Video: పులి దాడి వీడియోను షేర్ చేసిన ట్రంప్..బాధితుడి కుటుంబం ఆవేదన!
Trump Faces Backlash Over Taming Ai Tiger Video
Sharada V
|

Updated on: Oct 14, 2026 | 8:37 PM

Share

ఈ ఘటనలో పులి దాడి కారణంగా 23 ఏళ్ల విలియం చాప్‌మన్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ వీడియోలో ట్రంప్ ‘ప్రకృతితో ఎప్పుడూ ఆటలాడొద్దు!’ అనే సందేశాన్ని జత చేశారు. ఆ తర్వాత మనుషులపై వివిధ జంతువులు దాడి చేస్తున్న దృశ్యాలతో మరో వీడియో సంకలనాన్ని కూడా పోస్ట్ చేశారు. అయితే, అందులోని కొన్ని దృశ్యాలు ఏఐతో రూపొందించారు.

ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. పులి దాడిలో మరణించిన వ్యక్తి కుటుంబం విషాదంలో ఉన్న సమయంలో ఇలాంటి వీడియోను షేర్ చేయడం బాధిత కుటుంబం పట్ల సానుభూతి లేనట్లుగా ఉందని పలువురు నెటిజన్లు విమర్శించారు. అంతేకాదు, ప్రాణాంతకమైన పులి దాడికి సంబంధించిన వీడియోను కూడా ట్రంప్ షేర్ చేయడంతో వివాదం మరింత ముదిరింది.ఈ ఘటనపై ట్రంప్ స్పందించిన తీరును, ఆయన నిర్ణయాన్ని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. బాధిత కుటుంబం పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాల్సిందని అభిప్రాయపడుతున్నారు.

బాధితుడి కుటుంబం ఆవేదన.. వీడియోలు షేర్ చేయొద్దని విజ్ఞప్తి

పులి దాడిలో ప్రాణాలు కోల్పోయిన విలియం చాప్‌మన్ కుటుంబం.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని ప్రజలను కోరింది. ట్రంప్ ఆ దృశ్యాలను పోస్ట్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ‘తీవ్రంగా బాధించే ఆ దృశ్యాలను ప్రచురించడం, ఇతరులకు షేర్‌ చేయడం వల్ల ఇప్పటికే ఎంతో కష్టంలో ఉన్న మా కుటుంబ సభ్యులు మరింత మానసిక వేదనకు గురవుతున్నారు. వారు ప్రస్తుతం అత్యంత సున్నితమైన పరిస్థితిలో ఉన్నారు. దయచేసి ఈ వీడియోలను షేర్ చేయడం ఆపండి’ అని కుటుంబ సభ్యులు పలు మీడియా సంస్థలకు ప్రకటన విడుదల చేసారు. విలియం కొన్నేళ్లుగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడ్డాడనీ తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్ షేర్ చేసిన వీడియోలు, ఆ తర్వాత విడుదల చేసిన ఏఐ పులి వీడియోపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది.

View this post on Instagram

A post shared by Lovin Malta (@lovinmalta)

మరోవైపు, విలియంపై దాడి చేసిన ‘అల్టాయ్’ అనే పులిని చంపబోమని పార్క్ నిర్వాహకులు స్పష్టం చేశారు. అది అంతరించిపోయే ప్రమాదం ఉన్న అరుదైన సైబీరియన్‌ జాతికి చెందిన పులి. ప్రపంచవ్యాప్తంగా అడవుల్లో ఈ జాతి పులులు సుమారు 500 మాత్రమే ఉన్నాయి. ఇక, యువకుడు రక్షణ కోసం ఏర్పాటు చేసిన పులుల ఎన్‌క్లోజర్‌లోకి ఎలా ప్రవేశించాడనే విషయంపై స్థానిక డాన్‌కాస్టర్ కౌన్సిల్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us