మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. తమ ప్రాంతంలో రహదారి నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఇద్దరు మహిళలను కంకరతో సజీవంగా పూడ్చిపెట్టారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. మంగవా పోలీస్‌స్టేషన్ పరిధిలోని హినోటా జోరోట్ గ్రామంలోని ఓ ప్రైవేట్ భూమిలో రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మమతా పాండే, ఆశాపాండే అనే ఇద్దరు మహిళలను కంకరతో సజీవంగా పూడ్చిపెట్టారు.
శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కంకర లోడ్‌తో సజీవంగా పూడ్చిపెట్టిన ఆ ఇద్దరు మహిళలను.. కొద్దిసేపటికి స్థానికులు వారిని రక్షించారు. అనంతరం చికిత్స నిమిత్తం సమీపంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం కుదటపడిందని.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని పోలీసులు తెలిపారు.
కాగా, ఈ వైరల్ వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. డంపర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన ఒకర్ని అరెస్ట్ చేయగా.. పరారీలో ఉన్న మరో ఇద్దరు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై లా అండ్ ఆర్డర్ ఏడీజీ జైదీప్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇది భూవివాదానికి సంబంధించిన కుటుంబ వ్యవహారమని చెప్పారు. అటు ఈ సంఘటన స్థానికంగా రాజకీయ దుమారానికి దారితీసింది.
Two women were partially buried after the murrum was tipped over them from a truck while they were protesting against road construction in Madhya Pradesh’s Rewa district.
Our system will never take any action against the culprits coz law and order only for poor people.#Rewa#MP pic.twitter.com/j7ngE6BP7u— 𝐌𝐨𝐫𝐚𝐥𝐢𝐭𝐲 (@morality_1st) July 21, 2024
ఇది చదవండి: అప్పుడేమో రౌడీ బేబీ.. ఇప్పుడేమో వయ్యారాల నాటీ.. ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి