Viral Video: ఈ ‘లిటిల్ మాస్టర్’ టాలెంట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

Trending Video: సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. అద్భుతమైన ఫీట్స్‌తో నెటిజన్ల హృదయాలను ఓ వ్యక్తి దోచుకుంటున్నాడు.

Viral Video: ఈ లిటిల్ మాస్టర్ టాలెంట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
Short Man Viral Video

Updated on: Jun 12, 2022 | 11:16 AM

Trending Video: నెట్టింట్లో(Social Media) ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరలవుతుంటాయి. ఇందులో కొన్ని తెగ నవ్విస్తే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. మరికొన్ని షాకిస్తుంటాయి. నెటిజన్లకు ఈ వీడియోలు తెగ నచ్చడంతో ఎంతో ఇష్టంగా చూస్తుంటారు. ఇలాంటి కోవకే చెందిన ఓ వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. ఈ వీడియోలో యువ మాస్టర్ తన అద్భుతమైన ఫీట్స్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాడు. చాలా చిన్నగా కనిపిస్తోన్న ఈ మాస్ట్రో ఫీట్స్ చూస్తే.. మీరు కూడా ఫిదా అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

వైరల్ వీడియోలో కనిపిస్తున్న ఓ వ్యక్తి చేతులు ఉపయోగించకుండా అద్భుతమైన విన్యాసాలను ప్రదర్శిస్తున్నట్లు మీరూ వీడియోలో చూడొచ్చు. అతను గాలిలో పల్టీలను కొడుతున్నట్లు చూడొచ్చు. ఈ పొట్టి వ్యక్తిని మొదట్లో చూస్తుంటే ఓ చిన్నారి ఫీట్ చేస్తున్నట్టు అనిపించినా.. నిశితంగా చూసిన తర్వాత అసలు విషయం తెలుస్తుంది. అతను తన అద్భుతమైన ఫీట్‌తో ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నోవాక్ అనే ఐడితో షేర్ చేశారు. 5 లక్షల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. ఈ ఆశ్చర్యకరమైన వీడియోపై నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. లిటిల్ మాస్టర్‌కు స్వచ్ఛమైన ప్రతిభ ఉందని ఒక యూజార్ కామెంట్ చేస్తే, ‘అతని పాదాల్లో స్ప్రింగ్‌లు ఉన్నట్లున్నాయి అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us