
వైరల్ వీడియోలో మరణించిన వ్యక్తిని పారదర్శక సమాధులలో ఖననం చేయటం కనిపిస్తుంది. అక్కడి కుటుంబాలు తమ ప్రియమైనవారు అస్థిపంజరాలుగా మారడాన్ని చూస్తున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. వైరల్ వీడియోలో చుట్టూ పారదర్శక స్మశానవాటికలు కనిపిస్తున్నాయి. అవి ఖననం చేయబడిన మానవుల అస్థిపంజరాలను చూపిస్తున్నాయి. ఈ పారదర్శక సమాధులలో ఒకేచోట ఇద్దరు వ్యక్తులను కూడా పూడ్చిపెట్టబడి కనిపిస్తున్నారు. అంటే భార్యాభర్తలు కలిసి మరణిస్తే, వారిని కలిసి ఖననం చేస్తారు.
నివేదికల ప్రకారం.. ఈ ఆచారం చైనాలోని ఒక మారుమూల గ్రామంలో జరుగుతుందని తెలిసింది. ఇది శతాబ్దాలుగా అమలులో ఉన్న సాంప్రదాయ ఆచారం. ఇలా గాజు బాక్స్‌లాంటి సమాధుల్లో తమ వారిని ఖననం చేయడం వారికి ఇచ్చే గొప్ప గౌరవంగా పరిగణిస్తారు. అనేక ఆసియా దేశాలలో ప్రజలు మరణం తర్వాత మృతదేహాలను ఒక ప్రత్యేక గదిలో ఉంచి, ఆచారాలు, సంప్రదాయాలను నిర్వహిస్తారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఇలాంటి ఆచారంపై ప్రజలు భిన్నాభిప్రాయాలు తెలియజేస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది భయపడ్డారు. చాలా మంది కామెంట్ల రూపంలో తమ భయాన్ని వ్యక్తం చేశారు. షాకింగ్ ఎమోజీలను పోస్ట్ చేశారు. అలాంటి దృశ్యాలను చూడవలసిన అవసరం నాకు లేదు అని ఒకరు రాయగా, తమ ప్రియమైనవారు ఇలా అస్థిపంజరాలుగా మారడాన్ని చూడాలని ఎవరూ అనుకోరు అంటూ మరికొందరు పేర్కొన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..