
ఒక్క ఫోన్ కాల్‌తో రైల్వే గేటు వద్ద రైలు ఆగడమే కాకుండా, అందులోకి ప్రయాణికులు ఎక్కినట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో తీవ్ర వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో బిహార్‌లోని కుమార్‌బాగ్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే గేటు వద్ద రికార్డు చేసినట్లు సమాచారం. లెవెల్ క్రాసింగ్ గేటు పడిపోవడంతో ట్రాఫిక్‌లో ఆగిపోయిన ఒక కారులోని వ్యక్తి ఈ దృశ్యాలను రికార్డు చేశాడు. క్రాసింగ్ వద్ద ఉన్న ఒక వ్యక్తి ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతున్నాడని, అతనికి రైల్వే అధికారులతో కనెక్షన్లు ఉండి రైలు ఆపితే ఈ వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖకు పంపిస్తానని కారులోని వ్యక్తి వ్యాఖ్యానించాడు.
ఆశ్చర్యకరంగా, కొద్ది క్షణాల్లోనే రైలు సరిగ్గా ఆ రైల్వే గేటు ప్రాంగణంలోనే ఆగిపోయింది. వెంటనే బయట వేచి ఉన్న ఒక కుటుంబం/ప్రయాణికులు ఆ రైలు ఎక్కడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. రైలు అనేది ప్రైవేటు బస్సులా ఎక్కడడిగితే అక్కడ ఆపడానికి వీల్లేదు కదా అని రికార్డు చేస్తున్న వ్యక్తి ప్రశ్నించాడు.
ఈ వీడియో సోషల్ మీడియా X ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యక్షమవ్వగానే వేలాదిమంది దీనిని రీట్వీట్ చేస్తూ రైల్వే శాఖపై, సంబంధిత లోకో పైలట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైల్వే వ్యవస్థ ఏమైనా ప్రైవేట్ వాహనమా? అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నించగా, రైలులో ఉన్న ఎవరో ప్యాసింజర్ అత్యవసరంగా గొలుసు లాగడం వల్ల కూడా రైలు ఆగి ఉండే అవకాశం ఉందని మరికొందరు భావించారు.
వీడియో ఇక్కడ చూడండి..
एक आदमी रेलवे फाटक पर अपने परिवार को ट्रेन पकड़वाने के लिए खड़ा था। और फोन पे बात कर रहा था, वीडियो बनाने वाले ने बोला बात तो ऐसे कर रहा है, जैसे ट्रेन रुकवा देगा।😎
कुछ ही देर में ट्रेन सच में रुक गई और उनका परिवार चढ़ गया स्टेशन से पहले ही।
कुमारबाग रेलवे स्टेशन पर पैसेंजर… pic.twitter.com/3W8Ywsi7Yg
— सीतामढ़ी जिला 🇮🇳 (@SitamarhiJila) August 9, 2026
ఈ వీడియో విస్తృతంగా వ్యాపించడంతో రైల్వే శాఖకు చెందిన అధికారిక హెల్ప్‌లైన్ ఖాతా రైల్వే సేవా తక్షణమే స్పందించింది. ఈ పోస్ట్‌ను సమస్తిపూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ కి ట్యాగ్ చేస్తూ, సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నిజానికి సాంకేతిక లేదా అత్యవసర కారణాలు లేకుండా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తుల కోసం రైలును నిలిపివేయడం నిబంధనలకు విరుద్ధం, కాబట్టి ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..