Video Viral: వేగంగా పరిగెడుతున్న రైలు.. ముంచుకొచ్చిన పెను ప్రమాదం.. వాళ్లు లేకుంటే ప్రాణాలే పోయేవి..

రవాణా వ్యవస్థలో రైల్వే వ్యవస్థ (Indian Railways) అత్యంత కీలకం. దేశంలోని అనేక ప్రాంతాలకు నిత్యం కోట్ల సంఖ్యలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. అయితే రైలు ఎక్కేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మనం...

Video Viral: వేగంగా పరిగెడుతున్న రైలు.. ముంచుకొచ్చిన పెను ప్రమాదం.. వాళ్లు లేకుంటే ప్రాణాలే పోయేవి..
Train Accident

Updated on: Aug 10, 2022 | 9:36 AM

రవాణా వ్యవస్థలో రైల్వే వ్యవస్థ (Indian Railways) అత్యంత కీలకం. దేశంలోని అనేక ప్రాంతాలకు నిత్యం కోట్ల సంఖ్యలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. అయితే రైలు ఎక్కేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మనం చేసే ఏ చిన్న పొరపాటు అయినా అది మన ప్రాణాలే తీసేస్తుంది. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) నిత్యం వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం రైల్వే ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారి అప్రమత్తతతో పశ్చిమ బెంగాల్‌లోని బంకురా రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ, ఆమె కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం ట్విట్టర్‌లో (Twitter) పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ట్వీట్‌లో, ఆర్పీఎఫ్ సిబ్బందిని రైల్వే మంత్రిత్వశాఖ ప్రశంసించింది. రైల్వే స్టేషన్ నుంచి రైలు బయలుదేరుతున్న సమయంలో రైలు ఎక్కేందుకు ప్రయాణీకులు పరుగులు తీయడాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ క్రమంలో ఓ మహిళ తన కుమారుడితో కలిసి రైల్వే ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడిపోతుంది. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి వారిని కాపాడుతుంది.

ప్రమాదం జరగకముందే, ఆర్పీఎఫ్ అధికారి సంఘటనా స్థలానికి చేరుకుని వారిని రక్షించారు. మరికొందరు కూడా వారి వైపు పరిగెత్తుకుంటూ రావడాన్ని మనం వీడియోలో చూడవచ్చు. ఈ ఘటన దృశ్యాలు రైల్వే స్టేషన్‌లోసీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోకు ఇప్పటివరకు 28,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. వందల కొద్దీ లైక్‌లు, రీట్వీట్లు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆటోమేటిక్ డోర్‌లను అమర్చాలని భారతీయ రైల్వేలకు వినియోగదారులు కామెంట్ల రూపంలో సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి