Viral Video: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకున్నాడు చివరకు దెబ్బ తిన్నాడు.. వైరల్ అవుతోన్న వీడియో

|

Jun 30, 2022 | 2:15 PM

అంబులెన్స్ కు దారివ్వడం మన విధి. అత్యవసర సేవలో ఉండే అంబులెన్స్ కు దారిని ఇవ్వాలని పోలీసులు చెప్తూ ఉంటారు కొంతమంది మాత్రం దాన్ని పాటించుకోకుండా అంబులెన్స్ కు దారివ్వకపోగా దానికి అడ్డంగా దాని ముందు నుంచే వేగంగా వెళ్తుంటారు.

Viral Video: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకున్నాడు చివరకు దెబ్బ తిన్నాడు..  వైరల్ అవుతోన్న వీడియో
Viral
Follow us on

Viral Video: అంబులెన్స్ కు దారివ్వడం మన విధి. అత్యవసర సేవలో ఉండే అంబులెన్స్ కు దారిని ఇవ్వాలని పోలీసులు చెప్తూ ఉంటారు కొంతమంది మాత్రం దాన్ని పాటించుకోకుండా అంబులెన్స్ కు దారివ్వకపోగా దానికి అడ్డంగా దాని ముందు నుంచే వేగంగా వెళ్తుంటారు. ఇలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కారు డ్రైవర్ కావలెనే అంబులెన్స్ కు దారివ్వకుండా దాని కంటే వేగంగా కారు నడిపి ప్రమాదానికి గురయ్యాడు. తాజాగా వైరల్ అవుతోన్న వీడియో అంబులెన్స్ నుండి చిత్రీకరించబడింది. సైరన్ మొగుతోన్న శబ్దం వీడియోలో వినపడుతోంది. వర్షం పడుతుండటం, రోడ్డు పక్కన వర్షం నీరు చేరడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.అదే సమయంలో వేగంగా వెళ్తోన్న  అంబులెన్స్ ముందు ఓ కారు జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది.

అంబులెన్స్ వేగంగా వెళ్తుంటే.. మిగిలిన అన్ని వాహనాలు దానికి దారి ఇవ్వడం చూడవచ్చు. అయితే అదే సమయంలో ఆ కారు డ్రైవర్ వేగం పెంచి అంబులెన్స్‌తో రేసింగ్ చేయడం మొదలు పెట్టాడు. కారును రోడ్ల మీదుగా వేగంగా నడుపుతున్న ఆ వ్యక్తి. వేగం అంతకంతకు పెంచుకుంటూ పోయాడు. ఆ తర్వాత అతడు ఓ ట్రక్కును ఓవర్ టెక్ చేయబోయి ప్రమాదానికి గురయ్యాడు. స్పీడ్ ఎక్కువవడంతో కంట్రోల్ తప్పి స్కిడ్ అయి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి