
ఒక దేశం నుంచి మరో దేశానికి విమానంలో ప్రయాణించినా, ఆకాశం వైపు చూసినా భూమి అనంతంగా కనిపిస్తుంది. అయితే ఈ విశాలమైన భూగోళం విస్తీర్ణం ఎంత? అందులో నేల ఎంత? నీరు ఎంత? ప్రపంచంలో అతిపెద్ద దేశాలు ఏవి? మన భారతదేశం వైశాల్యం పరంగా ఏ స్థానంలో ఉంది? అనే సందేహాలు చాలామందికి వస్తుంటాయి. భూమి భౌగోళిక విస్తీర్ణానికి సంబంధించిన ఆసక్తికర వివరాలు, వాస్తవ గణాంకాలు చాలా మందికి తెలియవు.
మన భూగోళం మొత్తం ఉపరితల వైశాల్యం సుమారు 510 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఇందులో ఎక్కువభాగం సముద్రాలు, మహాసముద్రాలతో కూడిన నీటి భాగమే ఆక్రమించింది. మానవులు నివసించే ఖండాలు, ద్వీపాలతో కూడిన భూభాగం కేవలం 29 నుంచి 30 శాతం మాత్రమే, అంటే దాదాపు 149 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఈ పరిమిత భూభాగంలోనే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా 195 దేశాలు విస్తరించి ఉన్నాయి.
వైశాల్యం పరంగా చూస్తే ప్రపంచంలో అత్యంత పెద్ద దేశంగా రష్యా అగ్రస్థానంలో కొనసాగుతోంది. రష్యా ఎంత పెద్దదంటే.. ప్రపంచ భూభాగంలో దాదాపు 11 శాతానికి పైగా భూభాగం ఆ ఒక్క దేశంలోనే ఉంది.
అగ్రస్థానాల్లో ఉన్న దేశాల జాబితా..
ఈ ఆరు దేశాల తర్వాతే మిగిలిన ప్రపంచ దేశాలన్నీ వస్తాయి.
విస్తీర్ణం పరంగా మన భారతదేశం ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం*గా నిలిచింది.
మొత్తం వైశాల్యం: సుమారు 32,87,263 చదరపు కిలోమీటర్లు.
ప్రపంచ భూభాగంలో వాటా: ప్రపంచ మొత్తం నేల విస్తీర్ణంలో భారత్ వాటా కేవలం 2.4 శాతం మాత్రమే.
అంటే పైన పేర్కొన్న 6 అగ్ర దేశాలు మినహా, ప్రపంచంలోని మిగిలిన దాదాపు 188 దేశాలు విస్తీర్ణంలో భారత్ కంటే చిన్నవే కావడం విశేషం.
ఈ భారీ విస్తీర్ణం వల్లే ఉత్తరాన మంచుతో కప్పబడిన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్ర తీరం, పశ్చిమాన థార్ ఎడారి, మధ్యలో సారవంతమైన గంగా మైదానాలు వంటి విభిన్న శీతోష్ణస్థితులు భారత్‌లో ఒకేసారి కనిపిస్తాయి.
ఇక్కడ గమనించాల్సిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. భూభాగం పరంగా భారత్ ప్రపంచంలో కేవలం 2.4 శాతం భూమిని మాత్రమే కలిగి ఉంది. కానీ ప్రపంచ జనాభాలో చైనాను అధిగమించి నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. రష్యా, అమెరికా లేదా చైనా అంత భూభాగం లేకపోయినా.. పరిమిత స్థలంలోనే ప్రపంచంలో అత్యధిక జనాభాకు ఆశ్రయం కల్పిస్తున్న దేశంగా భారత్ ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంది.