AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంజనీరింగ్ అద్భుతం.. ప్రపంచంలో అత్యంత ఎత్తైన హైవే ..4,500 మీటర్ల ఎత్తులో..

భారత్‌- చైనా సరిహద్దులకు సమీపంలో ఉన్న టిబెట్ పీఠభూమి ఒకప్పుడు అత్యంత దుర్గమమైన ప్రాంతం. అటువంటి ప్రదేశంలో చైనా నిర్మించిన G6 నాగ్చు-ల్హాసా ఎక్స్‌ప్రెస్‌వే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హైవేగా రికార్డు సృష్టించింది. ఈ ఇంజనీరింగ్ అద్భుతం, సముద్ర మట్టానికి సుమారు 4,500 మీటర్ల (14,800 అడుగులు) ఎత్తులో ఉంది. దీని చారిత్రాత్మక రికార్డులు, సాంకేతిక సవాళ్లను తెలియజేస్తుంది.

ఇంజనీరింగ్ అద్భుతం.. ప్రపంచంలో అత్యంత ఎత్తైన హైవే ..4,500 మీటర్ల ఎత్తులో..
Worlds Highest Highway
Jyothi Gadda
|

Updated on: Sep 13, 2026 | 8:45 PM

Share

చైనాలో సాంకేతిక అద్భుతంగా రూపొందిన G6 నాగ్చు-ల్హాసా ఎక్స్‌ప్రెస్‌వే ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. టిబెట్ ఎత్తైన పీఠభూమిపై నిర్మించిన ఈ హైవే సముద్ర మట్టానికి సుమారు 4,500 మీటర్ల (14,800 అడుగులు) ఎత్తులో ఉంది. G6 నాగ్చు-ల్హాసా హైవే నాగ్చు మరియు ల్హాసా మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించింది. ఒకప్పుడు 6 గంటల సమయం పట్టే ప్రయాణం, ఇప్పుడు కేవలం 3 గంటలకే పూర్తవుతుంది. తీవ్రమైన చలి కారణంగా పాత రోడ్లు మంచుతో మూసుకుపోయేవి. కానీ, ఈ కొత్త ఎక్స్‌ప్రెస్‌వే ఏడాది పొడవునా రవాణాను సులభతరం చేస్తుంది.

ఈ హైవే టిబెట్ ఆర్థిక అభివృద్ధికి, ముఖ్యంగా పర్యాటక, రవాణా రంగాలకు భారీ ఊతాన్ని ఇస్తుంది. చైనా ప్రభుత్వం భవిష్యత్తులో చైనా ఎక్స్‌ప్రెస్‌వేల ప్రణాళికలు ఈ ప్రాంతాన్ని చారిత్రాత్మక రికార్డుల ద్వారా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. 4,500 మీటర్ల ఎత్తులో ఉండే తీవ్రమైన చలి మరియు మంచును తట్టుకునేలా హైవే రూపకల్పన చేశారు. మంచును కరిగించడానికి, రోడ్లను సురక్షితంగా ఉంచడానికి ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించారు.

ఈ ప్రాంతం భూకంపాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతం. అందువల్ల, నిర్మాణం అత్యంత సురక్షితంగా ఉండేలా భూకంప నిరోధక పద్ధతులను పాటించారు. ఎత్తైన ప్రదేశాలలో కార్మికులకు ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంటుంది. అందువల్ల, కార్మికుల రక్షణ కోసం ప్రత్యేక సౌకర్యాలు, పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మొత్తం మీద, G6 నాగ్చు-ల్హాసా ఎక్స్‌ప్రెస్‌వే చైనా ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా, టిబెట్ పీఠభూమిని చారిత్రాత్మక రికార్డులతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కలిపే ఒక ముఖ్యమైన వంతెనగా నిలిచింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆకాశవాణి భవన్‌ వద్ద హైటెన్షన్.. రాహుల్‌గాంధీ సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్..!
ఆకాశవాణి భవన్‌ వద్ద హైటెన్షన్.. రాహుల్‌గాంధీ సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్..!
26 శాతం తగ్గిన బంగారం ధర.. ఇప్పుడు కొనడం సరైనదేనా? వేచి ఉండాలా?
26 శాతం తగ్గిన బంగారం ధర.. ఇప్పుడు కొనడం సరైనదేనా? వేచి ఉండాలా?
అంతర్జాతీయ వేధింపుల గ్యాంగ్‌ వెనుక భారతీయుడు!
అంతర్జాతీయ వేధింపుల గ్యాంగ్‌ వెనుక భారతీయుడు!
‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్
వైధృతి యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో ఈ 3 రాశుల వారు జాగ్రత్త..!
వైధృతి యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో ఈ 3 రాశుల వారు జాగ్రత్త..!
ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ చేతికి వైమానిక దళ పగ్గాలు!
ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ చేతికి వైమానిక దళ పగ్గాలు!
భారత్‌లో డెబ్యూ మ్యాచ్ ఇప్పట్లో లేనట్టే వైభవ్.. అసలు విలన్ ఎవరు?
భారత్‌లో డెబ్యూ మ్యాచ్ ఇప్పట్లో లేనట్టే వైభవ్.. అసలు విలన్ ఎవరు?
దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త!
దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త!
ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట!
ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట!