AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరెరే ఎసిడిటీని తగ్గించడం ఇంత సింపులా?.. కిచెన్‌లో ఉండే దీన్ని నీటిలో మరిగించి తాగితే..!

తిన్న వెంటనే చాలా మందికి కొన్ని సార్లు అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం గ్యాస్ లేదా అజీర్ణం కావచ్చు. ఈ సమస్యను తగ్గించేందుకు జనాలు తరుచుగా మార్కెట్‌లో దొరికే వివిద మందులను వాడుతుంటారు. కానీ మన పూర్వీకుల నుంచి వాడుతున్న మన కిచెన్‌లో దొరికే పదార్థంతో ఈ సమస్యకు ఈజీగా చెక్‌ పెట్టవచ్చు. అదేంటి.. దాని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Sep 14, 2026 | 1:55 PM

Share
అజీర్ణం, గ్యాస్ సమస్యకు చెక్‌ పెట్టడంలో వాము చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ చిట్కాను మన పూర్వికుల కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. తిన్న వెంటనే మీకు అజీర్తిగా అనిపిస్తే వెంటనే కొన్ని నీటిలో వాము వేసి బాగా మరిగించిన.. చల్లార్చిన తర్వాత తాగండి.. ఇది కడుపు ఉబ్బరం గ్యాస్ సమస్యల నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది.అంతేకాదు మీరు అందులో కాస్త నల్ల ఉప్పు కలిపితే రిజల్ట్స్ మరింత మెరుగ్గా ఉంటాయి.

1 / 5
వాములో థైమోల్ అనే మూలకం పుష్కలంగా ఉంటుంది.. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి.. ఆమాశయంలో జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచడం ద్వారా ఆహారాన్ని వేగంగా విచ్ఛిన్నం చేస్తుంది. మీరు ఎక్కవగా తిన్నప్పుడూ లేదా తిన్న వెంటనే కడుపులో భారంగా అనిపిస్తే.. ఒక్కసారి ఈ పానియం తాగడం వల్ల పూర్తి ఉపశమనం పొందుతారు.

2 / 5
వాము నీటిలో కొంచెం నల్ల ఉప్పు కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ ఇంకా ఆరోగ్యవంతంగా మారుతుంది. దీనిని ఎలా వాడాలి అంటే.. ఒక టీ స్పూన్ వామును రాత్రి మొత్తం నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు అందులో కొద్దిగా నల్ల ఉప్పు వేసి దాన్ని బాగా కలిపి తాగవ్చు. దీనిని మీరు వేడి చేయాల్సిన అవసరం కూడా ఉండదు.. ఇలా తాగడం వల్ల  కడుపులోని హానికరమైన బ్యాక్టీరియా, సూక్ష్మజీవులను సులభంగా నాశనం చేస్తుంది.

3 / 5
అలాగే ఈ వాము నీరులో నల్ల ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరానికి అవసరమయ్యే సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా పుష్కలంగా అందుతాయి. మీకు సరిగ్గా ఆకలి వేయకున్నా, లేదా మీరు ఎక్కవగా తిన్నప్పుడు కడుపులో గజిబిజిగా అనిపించినా ఈ నీరు తాగడం వల్ల ఉపశమనాన్ని పొందుతారు.

4 / 5
అయితే ఈ వాము నీరు అందిరికీ ఒకేలాంటి ప్రయోజనాలు అందించకపోవచ్చు. కాబట్టి ఎక్కువ రోజులుగా అసిడిటీ,  ఛాతీలో మంట, అధిక రక్తపోటు, ఇతర తీవ్రమైన కడుపు సంబంధిత వ్యాధులతో బాధపడేవారైతే కచ్చితంగా వైద్యులను సంప్రదించిన తర్వాతే, వారి సూచన మేకు మాత్రం ఈ నీటిని తాగండి. Note: పైన పేర్కొన్న అంశాలు, ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని TV9 దృవీకరించలేదు!

5 / 5
Follow Us