Viral Video: మనిషైనా, పులైనా భార్యకు భయపడాల్సిందే.. ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది!

|

Sep 23, 2022 | 12:36 PM

అడవికి బాహుబలి సింహం అయితే.. డాన్ భల్లాలదేవుడు పులి. అదిగో పులి అంటే చాలు.. మిగతా జంతువులు ఠక్కున భయంతో..

Viral Video: మనిషైనా, పులైనా భార్యకు భయపడాల్సిందే.. ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది!
Tiger
Follow us on

అడవికి బాహుబలి సింహం అయితే.. డాన్ భల్లాలదేవుడు పులి. అదిగో పులి అంటే చాలు.. మిగతా జంతువులు ఠక్కున భయంతో పరుగులు పెడతాయి. మరి ఆ పులి కూడా ఒకరికి భయపడితే..? మీరెప్పుడైనా భయపడే పులిని చూశారా.? భయపడే పులా.? అదేంటి అని ఆలోచిస్తున్నారా.! అది ఎవరో కాదండీ.. ఆడ పులి. ఏ మగ పులైనా కూడా ఆడ పులికి భయపడాల్సిందే. ఇక్కడ అదే జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. జూలోని ఓ కొలను దగ్గర ఆడ పులి ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు మీరు చూడవచ్చు. అప్పుడే ఓ మగ పులి అక్కడికి వచ్చి.. దాన్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలోనే ఆడ పులిని తాకగానే.. అది వెంటనే త్వరగా లేచి మగ పులిపై గర్జిస్తుంది. కోపంతో దాడి చేసేందుకు పైపైకి వస్తుంది. ఇంకేముంది మగ పులి భయపడుతూ తోక ముడిచి వెనక్కి పరిగెడుతుంది.

కాగా, ఈ వీడియోను ‘lance’ అనే నెటిజన్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఇది ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్న వీడియో.. ఇప్పటిదాకా 15.5 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. అలాగే 6 లక్షల వరకు లైకులు వచ్చాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. మనిషైనా, పులైనా భార్యకు భయపడాల్సిందేనంటూ రాసుకొచ్చారు.