ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు దొంగలు బైక్‌పై వచ్చారు. పంజాబ్ లోని మోగాలో బ్యాంక్ దోపిడీకి ప్రయత్నించారు. కాని అలర్ట్‌గా ఉన్న బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ దోపిడీ యత్నాన్ని భగ్నం చేశాడు. ముగ్గురు దొంగలతో ప్రాణాలకు తెగించి పోరాటం చేశాడు. దొంగలు తల్వార్లతో దాడి చేసినప్పటికి ఆ సెక్యూరిటీ గార్డ్ అదరలేదు .. బెదరలేదు. ముగ్గురిని ఒంటి చేత్తో పట్టుకునే ప్రయత్నం చేశాడు. చేతికి తీవ్రగాయమైనప్పటికి ఆ సెక్యూరిటీ గార్డ్ దొంగలపై కాల్పులు జరిపాడు. ప్రాణభయంతో ఆ దొంగలు బైక్‌పై పలాయనం చిత్తగించారు. వృద్దుడైన ఆ సెక్యూరిటీ గార్డ్‌ను పోలీసులు అభినందించారు. ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో దోపిడీకి ప్రయత్నించారు దొంగలు.