Viral: అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్న వ్యక్తి.. రిపోర్టులు చూడగా డాక్టర్లకు మైండ్ బ్లాంక్!

|

Aug 15, 2022 | 7:36 PM

కిడ్నీ నొప్పిగా ఉందని ఓ వ్యక్తి దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి డాక్టర్లు అతడ్ని అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోమని చెప్పారు..

Viral: అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్న వ్యక్తి.. రిపోర్టులు చూడగా డాక్టర్లకు మైండ్ బ్లాంక్!
Ultrasound Scan
Follow us on

కిడ్నీ నొప్పిగా ఉందని ఓ వ్యక్తి దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి డాక్టర్లు అతడ్ని అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోమని చెప్పారు. ఆ వ్యక్తి స్కానింగ్ చేయించుకోగా.. అనంతరం వచ్చిన రిపోర్ట్స్ చూసి డాక్టర్లు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇంతకీ ఆ కథేంటంటే..

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన సుశీల్ గుప్తా అనే వ్యక్తి కిడ్నీలు నొప్పిగా ఉండటంతో స్థానిక ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడున్న డాక్టర్లు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని సూచించారు. అందులో భాగంగానే సుశీల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్నాడు. ఇక అనంతరం వచ్చిన స్కాన్ రిపోర్ట్స్ చూసి డాక్టర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సుశీల్ శరీరంలో మూడు కిడ్నీలు ఉన్నట్లు రిపోర్ట్స్‌లో తేలింది. ఎడమవైపు రెండు కిడ్నీలు.. కుడివైపు ఒక కిడ్నీ ఉన్నట్లు డాక్టర్లు తనకు చెప్పినట్లుగా సుశీల్ వెల్లడించాడు.

ఇదిలా ఉంటే.. ఈ అరుదైన కేసుపై స్థానిక డాక్టర్ ఒకరు మాట్లాడుతూ.. కడుపులోని పిండం సరిగ్గా అభివృద్ధి చెందుతున్న క్రమంలో రెండు కిడ్నీలు ఒక వైపు.. ఒక కిడ్నీ ఇంకో వైపు అభివృద్ధి చెందాయని.. అందుకే అతడికి మూడు కిడ్నీలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అతడి మూడు కిడ్నీలు సరిగ్గా పని చేస్తున్నాయని.. కాని ఇలాంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. చిన్న ప్రమాదం జరిగినా.. కిడ్నీలు దెబ్బ తినే అవకాశం ఉందని.. వీరు క్రీడలు అస్సలు ఆడకూడదని డాక్టర్ తెలిపారు.