Pushpa Song: అచ్చమైన తెలుగులో శ్రావ్యంగా శ్రీవల్లి సాంగ్ ను ఆలపించిన డచ్ సింగర్.. వీడియో వైరల్..

|

Feb 10, 2022 | 6:01 PM

Pushpa Srivalli Song: స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన పుష్ప మూవీ రిలీజై దాదాపు నెల రోజులవుతున్నా ఈ రోజుకీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజైన పుష్ప మూవీ బాక్సాఫీస్(BoxOffice)..

Pushpa Song: అచ్చమైన తెలుగులో శ్రావ్యంగా శ్రీవల్లి సాంగ్ ను ఆలపించిన డచ్ సింగర్.. వీడియో వైరల్..
Dutch Woman Singing Allu Arjun’s Pushpa Song
Follow us on

Pushpa Srivalli Song: స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన పుష్ప మూవీ రిలీజై దాదాపు నెల రోజులవుతున్నా ఈ రోజుకీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజైన పుష్ప మూవీ బాక్సాఫీస్(BoxOffice) వద్ద ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. ఈ సినిమాలోని డైలాగ్స్, పాటలు తెలుగువారినే కాదు.. దేశ విదేశాల వ్యక్తులను కూడా ఆకట్టుకుంటున్నాయి. సెలబ్రేటీలు, క్రీడాకారులు, సమన్యులనే బేధం లేకుండా పుష్ప ఫీవర్ కొనసాగుతూనే ఉంది. అల్లు అర్జున్ శ్రీవల్లి సాంగ్ లోని హుక్ స్టెప్‌ని రీక్రియేట్ చేస్తున్న లెక్కలేనన్ని రీల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తాజాగా ఓ విదేశీ గాయని తన మధురామైన గాత్రంతో తెలుగులోని శ్రీవల్లి సాంగ్ ని పాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనేక మంది హృదయాలను గెలుచుకుంటుంది.

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను ఎమ్మా హీస్టర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. గతంలో బిజిలీ బిజిలీ వంటి బాలీవుడ్ సాంగ్స్ ను పాడిన ఈ ఏమ్మా .. షేర్షాలోని ప్రసిద్ధ పాట రంఝా ఆంగ్ల వెర్షన్‌ను కూడా పాడింది. తాజా తెలుగులోని పుష్పలోని నీ చూపే బంగారమాయనే శ్రీవల్లి సాంగ్ ను” అత్యంత శ్రావ్యంగా పాడింది. ఈ వీడియో క్లిప్ ఆన్ లైన్ షేర్ చేసిన వెంటనే లక్షలాది మందిని ఆకట్టుకుంది. ఈ వీడియో క్లిప్.. 1 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఎమ్మా గాత్రానికి.. భావుకతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఓ మై గాడ్, ఇది అద్భుతంగా ఉంది అంటూ ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.

 

Also Read: Corona Virus: కరోనా నిబంధనలకు, వ్యాక్సిన్ కి వ్యతిరేకంగా ఆ దేశంలో భారీ నిరసనలు..భారతీయులకు పలు సూచనలు చేసిన హైకమీషన్