ఆత్మవిశ్వాసమే శరీరానికి అసలైన ఆభరణం. అది తోడుగా ఉన్నప్పుడు ఎలాంటి అంగవైకల్యమున్నా చిన్నదిగానే కనిపిస్తుంది. ఈ మాటలను నిరూపిస్తూ శారీరక లోపాలున్న ఎంతో మంది అద్భుతాలు సృష్టిస్తున్నారు. వివిధ రంగాల్లో తమ సృజనాత్మకతను చాటుకుంటూ అబ్బురపరుస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడబోయే చిన్నారి కూడా ఈ కోవకే చెందుతుంది. పుట్టుకతోనే కాళ్లు లేని ఒక పదేళ్ల పాప తన జిమ్నాస్టిక్స్ స్కిల్స్‌తో అందరి కళ్లను తనవైపు తిప్పుకుంటోంది.
స్ఫూర్తిని పంచుతోంది..
అమెరికాలోని ఒహియో నగరానికి చెందిన10 ఏళ్ల పైజ్ క్యాలెండన్ అంగవైకల్యంతోనే ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అయితే తన శారీరక లోపాన్ని చూసి ఏనాడు కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసం, మనోధైర్యం వంటి లక్షణాలను ఆయుధాలుగా మల్చుకుని ముందుకు సాగుతోంది. జిమ్నాస్టిక్స్‌లో అద్భుతమైన నైపుణ్యం కనబరుస్తూ తన లాంటి వారికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ క్రమంలో తను జిమ్నాస్టిక్స్ సాధన చేసే వీడియోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తోందీ సూపర్ కిడ్. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పైజ్ జిమ్నాస్టిక్స్ ఫీట్లను చూసి నెటిజన్లందరూ తెగ ఆశ్చర్యపోతున్నారు. ‘వావ్..వండర్ ఫుల్ కిడ్’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
10-year-old Paige Calendine of Ohio is a force!???.
(?:heidi.calendine)???— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) October 25, 2021
Also Read: