పజిల్స్, ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. ఇవన్నీ కూడా మన మెదడుకు కూసింత మేత వేయడమే కాదు.. మనలో చురుకుదనాన్ని సైతం పెంచుతాయి. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్‌లో వీటి క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఇవే.. ‘ఈ ఫోటోలో ఏముందో కనిపెట్టండి’, ‘ఈ ఫోటోలో జంతువును గుర్తించండి’ అంటూ సోషల్ మీడియాలో మనల్ని ఎప్పుడూ పలకరిస్తూనే ఉన్నాయి. మరి తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్‌పై లుక్కేద్దాం.. అందులో ఉన్న తప్పును కనిపెట్టేద్దాం. పైన పేర్కొన్న ఫోటోను మీరు చూసే ఉంటారు.? అందులో మీకు ఎటు చూసినా ‘6’ నెంబర్ సిరీస్ కనిపిస్తుంది. హా.. ఎస్.. మీరు అనుకునేది కరెక్టే.. కానీ అందులోనే ఒక తప్పు ఉంది. దాన్ని మీరు కేవలం 10 సెకన్లలో కనిపెట్టాలి. అప్పుడే మీ కళ్లల్లో మ్యాజిక్ ఉన్నట్లు.. మరి లేట్ ఎందుకు ఓసారి ప్రయత్నించండి. ఫస్ట్ అటెంప్ట్‌లో కనిపెట్టి పజిల్ సాల్వ్ చేయండి.. అప్పుడే మీరు మేధావులు అని ఒప్పుకుంటాం. ఒకవేళ మీకు దొరక్కపోతే సమాధానం కోసం కింద ఫోటో చూడండి.
here is the answer pic.twitter.com/UhMZuTGTOf
— telugufunworld (@telugufunworld) February 9, 2023