Viral Video: ‘ఛీ దీనమ్మ జీవితం’.. ఓ దొంగ ఫీలింగ్ ఇది.. వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు..!

Viral Video: ఏ పనైనా సులువుగా, ఆలోచనాత్మకంగా చేయాలి. లేదంటే ఆ పని సక్సెస్ కాదు. ముఖ్యంగా తొందరపడి ఏ పని కూడా చేయకూడదు.

Viral Video: ‘ఛీ దీనమ్మ జీవితం’.. ఓ దొంగ ఫీలింగ్ ఇది.. వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు..!
Robbery

Updated on: Feb 24, 2022 | 10:13 AM

Viral Video: ఏ పనైనా సులువుగా, ఆలోచనాత్మకంగా చేయాలి. లేదంటే ఆ పని సక్సెస్ కాదు. ముఖ్యంగా తొందరపడి ఏ పని కూడా చేయకూడదు. ఈ విషయాన్ని పెద్దలు తరచుగా చెబుతూనే ఉంటారు. కానీ వీటిని కొందరు బొత్తిగా పాటించరు. చివరకు చేతులు కాల్చుకుని ముడుచుకుపోతారు. తాజాగా ఆ కొవకు చెందిన వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక దొంగ చేసిన పని చూస్తే పడి పడి నవ్వుతారు. పాపం అని కూడా అనుకుంటారు.

సాధారణంగా దొంగలు ఏదైనా ఇంట్లోకి చొరబడితే తలుపులో, కిటీకీనో పగులగొట్టి ఇంట్లోకి దూరుతారు. ఇక్కడ కూడా ఓ వ్యక్తి అలాగే చేశాడు. అయితే, ఆ ఇంటికి సదరు దొంగ పూర్తిగా పరిశీలించనట్లుంది. ఫలితంగా అదిరిపోయే ట్విస్ట్‌ని అతను ఫేస్ చేశాడు.

వీడియోలో దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో ఇంట్లోకి ప్రవేశించాడు దొంగ. అయితే, ఇంటి తలుపులు, కిటికీలు అన్నీ మూసివేసి ఉండటంతో ఎలా లోపలికి వెళ్లాలా అని సందిగ్ధంలో పడిపోయాడు. డోర్ దగ్గర నిలబడి ఏం చేయాలా అని ఆలోచిస్తూ.. కిటికీ దగ్గరకు వచ్చాడు. చివరికి కిటికీని తెరవడానికి ప్రయత్నించాడు. తీవ్రంగా శ్రమించి.. కిటికీని తెరిచి లోపలికి ప్రవేశించాడు. అప్పుడే అసలైన ట్విస్ట్ ఎదురైంది. ఆ దొంగ ఎంటరైంది ఇంట్లోకి కాదు.. కారు పార్కింగ్ ప్లేస్‌లోకి. అతను అలా లోపలికి ప్రవేశించి.. ఇవతలి నుంచి అంతా ఓపెన్‌గా ఉంది. అది చూసి ఆ దొంగ కంగుతిన్నాడు. అతని హావభావాలు చిత్ర విచిత్రంగా కనిపించాయి. ‘ఛీ దీనమ్మ జీవితం’ అనుకుంటూ నిట్టూరుస్తూ వెనుదిరిగి వెళ్లిపోయాడు. ఈ సన్నివేశం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వడం, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.


Also read:

Russia Ukraine War Live: యుద్ధం మొదలైంది.. ఉక్రెయిన్‌పై ముప్పేట దాడికి దిగిన రష్యా