మనం చేసే ప్రతీ పనిని పైనుంచి దేవుడు గమనిస్తూనే ఉంటాడని పెద్దలు చెబుతుంటారు. మంచి పనులు చేసేవారికి పుణ్యాన్ని.. చెడ్డ పనులు చేసేవారికి పనిష్మెంట్‌ను తక్షణమే ఇచ్చేస్తుంటాడు దేవుడు. ఇది కొందరుకు ఉండే విశ్వాసం. ఇక ఇలాంటి సంఘటనలు మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ‘giedde’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ అప్‌లోడ్ చేసిన ఈ వీడియోకు ఇప్పటిదాకా 53 వేలకు పైగా వ్యూస్, ఏడు వేలకు పైగా లైకులు వచ్చాయి.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ బైకర్.. కారును తప్పించబోయి తన బైక్‌తో సహా రోడ్డు ప్రక్కన పడిపోవడాన్ని మీరు చూడవచ్చు. ఇక అక్కడే ఉన్న కొంతమంది వ్యక్తులు సదరు వ్యక్తికి సహాయం చేసేందుకు వస్తారు. ఆ జనంలోని ఓ వ్యక్తి అదే అదును చూసుకుని బైక్‌ను దొంగలించాలని ప్రయత్నిస్తాడు. బైకర్‌తో పాటు మిగిలిన జనం అంతా బైక్‌పై ధ్యాస మరల్చినప్పుడు.. ఆ దొంగ బైక్‌తో పారిపోవాలని ట్రై చేస్తాడు. అంతే! అక్కడ సీన్ కాస్తా రివర్స్ అయింది. సెకన్ల వ్యవధిలో కొద్ది దూరంలో బైక్‌తో సహా పడిపోతాడు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.
కాగా, ఈ వీడియోకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘కర్మ సిద్దాంతం అంటే ఇదేనేమో’ అంటూ నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.