Telugu News Trending These venomous sea creatures are even older than the dinosaurs the man dies in a minutes here are the shocking details
Sea Creatures: ఈ జీవులు చాలా డేంజర్ గురూ.. మనిషిని కాటేస్తే నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోతారు..!
Sea Creatures: ఈ భూమిపై మిలియన్ల సంఖ్యలో రకరకాల జంతువులు ఉన్నాయి. వాటిలో చాలా వరకు జీవులు ప్రకృతి ఒడిలో నిశ్శబ్దంగా..
Jelli Fish
Follow us on
Sea Creatures:ఈ భూమిపై మిలియన్ల సంఖ్యలో రకరకాల జంతువులు ఉన్నాయి. వాటిలో చాలా వరకు జీవులు ప్రకృతి ఒడిలో నిశ్శబ్దంగా జీవిస్తూ బయటి ప్రపంచానికి తెలియకుండా మనుగడ సాగిస్తున్నాయి. ఇలాంటి జీవుల్లో చాలా వరకు అత్యంత ప్రమాకరమైన జీవులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎంత ప్రమాదకరమైనవి అంటే.. ఒక వ్యక్తిని కాటేస్తే నిమిషాల వ్యవధిలో చనిపోతారు. సాధారణంగా పాములు అత్యంత విషపూరితమైనవిగా భావిస్తాం. కానీ, అంతకు మించి విషపూరితమైన జీవులు ఈ భూమిపై చాలానే ఉన్నాయి. ముఖ్యంగా సముద్ర జీవుల్లో అత్యంత ప్రమాదకరమైనవి ఉన్నాయి. ఇవి డైనోసార్ల కంటే కూడా అత్యంత పురాతనమైనవి, అంతేస్థాయిలో ప్రమాదకరమైనవి కూడా. ఇలాంటి ప్రమాకరమైన జీవుల్లో జెల్లీ ఫిష్‌ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. జెల్లీ ఫిష్ ఎంతటి ప్రమాదకరమో, దానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బాక్స్ జెల్లీ ఫిష్ సాధారణంగా ఆస్ట్రేలియా, ఇండో-పసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తుంది. వీటిలో టెన్టకిల్స్ విషపూరిత బాణాలాన్ని అవయవాలను కలిగి ఉంటాయి. ఇవి నిమిషాల వ్యవధిలో ఒక వ్యక్తిని చంపగలవు. ఇవి కాటేస్తే.. మనిషికి గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోతారు.
జెల్లీ ఫిష్ డైనోసార్ల కంటే పురాతనమైనదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. దాదాపు 505 మిలియన్ సంవత్సరాల పురాతనమైన జెల్లీ ఫిష్ యొక్క శిలాజాలను సైంటిస్టులు కనుగొన్నారు. వీటి ఆధారంగా అవి డైనోసార్ యుగం కంటే ముందు నుంచే భూమిపై ఉన్నాయని చెబుతున్నారు.
బాక్స్ జెల్లీ ఫిష్‌లోని ఒక జాతిని ‘అమర జంతువు’ అని కూడా పిలుస్తారు, ఇది ఎప్పటికీ చనిపోదు. ఈ జాతిని టర్రిటోప్సిస్ డోర్ని అని పిలుస్తారు. ఈ జెల్లీ ఫిష్‌ను రెండుగా ముక్కలు చేసినా చావదు. దానిని కోసినా.. శరీరం నుంచి మరో జెల్లీ ఫిష్ పుడుతుంది.
అయితే, ప్రమాదకరమైన జెల్లీ ఫిష్‌లతో పాటు.. తినదగిన జెల్లీ ఫిష్‌లు కూడా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. వంటకాల్లో వీటిని వినియోగిస్తారు. నూడుల్స్‌లో కూడా వీటిని తింటారు.