పాము.. ఈ పేరు వింటేనే కొంతమందికి వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే అవి భూమి మీద ఉండే అత్యంత డేంజరస్ యానిమల్స్ ఒకటి. అవి కాటేస్తే చాలు కాటికే అంటారు. అందుకే పాములంటే చాలా మందికి భయం. అవి కనిపిస్తే చాలు.. ఆమడదూరం పారిపోతారు. ఇంతవరకు బాగానే ఉంది.. మీ కంటికి కనిపించే పాములైతే.. మీరు చూస్తారు.. ఠక్కున పరుగులు పెడతారు. మరి ఎదురుగా ఉన్నా సరిగ్గా గుర్తుపట్టని పాములైతే… ఎలా మరి.? ఎప్పుడైనా ఆలోచించారా.!
ఏంటీ.! ఎండిన ఆకులను చూపించి.. ఓ పాము కథ చెప్పాడని అనుకుంటున్నారా.. ఆగండాగండి.. ఇక్కడే ఉంది అసలు కథ. ఇందులోనే ఓ పాము ఉంది.! నమ్మలేకపోతున్నారా.! కావాలంటే.. జూమ్ చేసి చూడండి.. కచ్చితంగా కనిపిస్తుంది. మీ కళ్లకు కాస్త పని చెప్తే.. మీరు పామును గుర్తించేయెుచ్చు.
చాలా సందర్భాల్లో మన ఇళ్ల ఎదురుగా ఆకులు రాలినప్పుడు ఇలాంటి చెత్తే కనిపిస్తూ ఉంటుంది. అవును నిజమే కానీ.. అప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది ఈ పాము. ఎందుకంటే ఆకుల కలర్‌లోనే ఉన్న పామును కీన్‌గా గమనిస్తే కానీ గుర్తించలేం. ఒకవేళ చూడకుండా అలాగే ముందుకెళితే… దానిపై కాలువేసే పరిస్థితి వస్తే.. ఇక ఊహించుకోండి ఆ తర్వాత పరిస్థితి ఏంటో.!
Find The Snake In This Viral Picture..@TrendingWeibo @trending @TheViralFever @the_viralvideos @itsgoneviraI @ViralPosts5 @StoryfulViral #Viral #TrendingNow #Trending pic.twitter.com/S8gusDvqYA
— telugufunworld (@telugufunworld) June 4, 2022