Viral Photo: తగ్గేదేలే.. ఈ ఫోటో దాగున్న పామును కనిపెడితే మీరు గ్రేటే.!

|

Feb 23, 2022 | 12:36 PM

పజిల్స్ ఎవరికి ఇష్టముండవు. అందరికీ ఇష్టమే. సోషల్ మీడియాలో ఇలాంటివి కోకొల్లలు. వీటిపై నెటిజన్లు విపరీతంగా ఆకర్షితులవుతారు...

Viral Photo: తగ్గేదేలే.. ఈ ఫోటో దాగున్న పామును కనిపెడితే మీరు గ్రేటే.!
Find The Snake
Follow us on

పజిల్స్ ఎవరికి ఇష్టముండవు. అందరికీ ఇష్టమే. సోషల్ మీడియాలో ఇలాంటివి కోకొల్లలు. వీటిపై నెటిజన్లు విపరీతంగా ఆకర్షితులవుతారు. మన మెదడుకు మేత వేయడమే కాకుండా.. కళ్లకు పదును పెడుతుంటాయి ఫోటో పజిల్స్. మన కళ్లల్లో పదునుంటే.. చిటికెలో ఫోటో పజిల్స్ సాల్వ్ చేసేయగలం. తాజాగా ఫోటో పజిల్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. చూడటానికి చెట్టు మొదలుగా కనిపించే ఆ ప్రాంతం నిండా ఎండిపోయిన ఆకులు చుట్టూ పడి ఉన్నాయి. అలాగే విరిగిన చెట్టు కొమ్మలు కూడా పక్కనే ఉన్నట్లు మీరు గమనించవచ్చు. అక్కడక్కడ పచ్చని ఆకులు.. ఇలా చిందరవందరగా ఉన్న ఆ ప్రదేశంలో ఓ విషసర్పం సేద తీరుతోంది. దాన్ని మీరు కనిపెట్టాలి. మీ కళ్లల్లో పదునున్నట్లయితే.. క్షణాల్లో పజిల్‌ను సాల్వ్ చేయగలరు. ఇక ఈ ఫోటో పజిల్‌ను సాల్వ్ చేయడంలో 99 శాతం మంది ఫెయిల్ అయ్యారు. అయితే కొంతమంది మాత్రం చిటికెలో సాల్వ్ చేసేశారు. మరి మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఫస్ట్ అటెంప్ట్‌లో సాల్వ్ చేస్తే ఓకే గానీ.. లేకపోతే సమాధానం కోసం క్రింద ఫోటో చూడండి.