Video Viral: ఇదేం దొంగతనం రా బాబూ.. బ్యాంకులో చొరబడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే పడీ పడీ నవ్వాల్సిందే

దొంగతనాలు సాధారణంగా ఎవరూ లేని సమయంలో జరుగుతుంటాయి. రాత్రి వేళల్లో దుకాణాలు, ఇళ్లలో చోరీలు చేస్తుంటారు. అందరూ నిద్ర పోతున్న సమయంలో గుట్టుచప్పుడు కాకుండా అందినంతా దోచుకుని వెళ్లిపోతారు...

Video Viral: ఇదేం దొంగతనం రా బాబూ.. బ్యాంకులో చొరబడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే పడీ పడీ నవ్వాల్సిందే
Bank Theft

Updated on: Sep 27, 2022 | 6:57 PM

దొంగతనాలు సాధారణంగా ఎవరూ లేని సమయంలో జరుగుతుంటాయి. రాత్రి వేళల్లో దుకాణాలు, ఇళ్లలో చోరీలు చేస్తుంటారు. అందరూ నిద్ర పోతున్న సమయంలో గుట్టుచప్పుడు కాకుండా అందినంతా దోచుకుని వెళ్లిపోతారు. కొన్ని కొన్ని సార్లు బ్యాంకుల్లోనూ లూటీలు, దోపిడీలు జరుగుతుంటాయి. షాపుల్లో మనుషులు లేని సమయంలో జరగుతున్నవే కాకుండా.. అందరూ ఉండగా కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. ఎంత మంది ఉన్నా లెక్కచేయకుండా వచ్చిన పని కానిచ్చేస్తుంటారు. తుపాకీ, కత్తి వంటి మారణాయుధాలతో భయపెట్టి, బెదిరించి వస్తువులు, నగదు ఎత్తుకెళ్తుంటారు. వీటిని అరికట్టేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా దొంగతనాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. కనీసం భయం కూడా లేకుండా తమ చేతివాటం చూపిస్తున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. అంతే కాకుండా వీటిని చూసేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో దుండగులు తుపాకీ తో దోపిడీ చేయడాన్ని చూడవచ్చు. ఈ వీడియోలో దుండగులు డబ్బు, నగలు కాకుండా ఇంటర్నెట్ రూటర్లు, మొబైల్‌లను తీసుకువెళ్లడం కనిపిస్తుంది. బ్యాంక్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో ఇద్దరు ఉద్యోగులు కూర్చొని పని చేస్తుండగా ముగ్గురు అగంతకులు అక్కడికి చేరుకుంటారు. బ్యాంకు ఉద్యోగులను కొట్టి, అక్కడ ఉన్న మొబైల్‌తో పాటు ఇంటర్నెట్ రూటర్‌ను లాక్కొని పారిపోతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సాధారణంగా బ్యాంకుల్లో దొంగతనాలు కేవలం డబ్బు కోసమే జరుగుతాయి. అయితే బ్యాంకులో ఇంటర్నెట్ రూటర్‌ను దోచుకోవడం వంటి సంఘటనలను మీరు చాలా అరుదుగా చూసి ఉంటారు. ఈ దొంగతనం గురించి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ లో జరిగింది. సెప్టెంబరు 25న జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి