AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Driving: పట్టువదలని విక్రమార్కి! డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఎన్నేళ్లుగా ప్రయత్నిస్తుందో తెలిస్తే మీ కళ్ళు తిరగడం ఖాయం!

కారు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే ఏమి చేయాలి అంటే..ముందు డ్రైవింగ్ నేర్చుకోవాలి. డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఎన్నిరోజులు పడుతుంది?

Driving: పట్టువదలని విక్రమార్కి! డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఎన్నేళ్లుగా ప్రయత్నిస్తుందో తెలిస్తే మీ కళ్ళు తిరగడం ఖాయం!
Driving License
KVD Varma
|

Updated on: Aug 27, 2021 | 10:17 AM

Share

Driving:  కారు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే ఏమి చేయాలి అంటే..ముందు డ్రైవింగ్ నేర్చుకోవాలి. డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఎన్నిరోజులు పడుతుంది? ఈ ప్రశ్నకు ఎక్కువలో ఎక్కువ ఆరునెలలు అని సమాధానం వస్తుంది. అదీ ఎక్కువే అని చాలామంది చెప్పినా చెబుతారు. కానీ, 17 ఏళ్ళు ప్రయత్నం చేసినా డ్రైవింగ్ రాలేదట ఓ అమ్మడికి. పాపం దీనికోసం ఆమె ఎంత ఖర్చు చేసిందో తెలిస్తే మన కళ్ళు తిరుగుతాయి. ఈ పట్టువదలని విక్రమార్కి కథ ఏమిటో చూద్దాం..

ఈమె పేరు ఇసబెల్లె స్టెడ్‌మన్. వయసు 47 సంవత్సరాలు..ఈమె డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్ తీసుకోవాలని 30 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తోంది. కానీ, అబ్బే ఎక్కడ పని జరగలేదు. దీనికోసం ఈమె ఇప్పటివరకూ పది లక్షల రూపాయలు ఖర్చు చేసింది. పాపం ఆమెకు డ్రైవింగూ రాలేదు. లైసెన్సూ దొరకలేదు. ఆమె తన 17వ ఏటా డ్రైవింగ్ నేర్చుకోవడం ప్రారంభించిందట.

ఇసాబెల్ ఒక సూపర్ మార్కెట్‌లో పనిచేస్తుంది. ఆమె ఇలా చెబుతోంది “నేను గత 30 సంవత్సరాలుగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను. అయితే, ఎప్పుడు కారు ఎక్కినా నాకు విపరీతమైన భయం వేస్తుంది. కొద్దీ సేపటికే కళ్ళు తిరుగుతాయి. ఇలా ఎందుకు జరుగుతుంది?”

ఇసాబెల్లెకు బ్లాక్‌అవుట్ సమస్య ఉంది. ఇది ఎందుకు జరుగుతుందో  ఆమెకే అర్థం కాలేదు. కారు నడిపిన వెంటనే ఆమె  ఒక్కసారిగా టెన్షన్‌కు గురవుతుంది. ఆమె మెదడు పేలిపోయినట్లు అనిపిస్తుంది. ఆమె స్పృహ కోల్పోతుంది. ఆమె కలత చెందడం ప్రారంభం అవుతుంది. దీంతో  ఇంటికి వెళ్లాలని కోరుకుంటుంది. ఇలా ఎన్నిసార్లో జరిగింది. కానీ, ఆమె ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది.

ఆమె తన కుమార్తెను విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లడానికి, దూరంగా నివసిస్తున్న బంధువులను కలవడానికి కారు నడపాలని కోరుకుంటుంది. తన పిల్లలు ఇద్దరూ త్వరలో డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలని ఆమెకోరుకుంది. అలాగే ఆమె పిల్లలు ఇద్దరూ డ్రైవింగ్ లైసెన్సులు సాధించారు. ఇది ఇంకా ఆమెను బాధిస్తోందని చెబుతోంది. తన కల నెరవేరడంలేదని బాధపడుతోంది.. ఎప్పటికైనా ఒకరోజు డ్రైవింగ్ లైసెన్స్ పొంది తీరుతాను అని ఆమె చెబుతోంది.

Also Read: Kabul Airport Explosions: ‘ఆఫ్గన్‌లను చంపడం ఆపండి.. దారుణ పరిస్థితుల్లో మమ్మల్ని వదిలేయకండి’: స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్

Afghanistan Crisis: తాలిబన్లతో ప్రపంచానికి సరికొత్త తలనొప్పి.. శరణార్థుల ముసుగులో తీవ్రవాదులు చొరబడే అవకాశం!