Viral Photo: తగ్గేదేలే.! ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టండి చూద్దాం.. అంత ఈజీ కాదండోయ్..

|

Feb 01, 2022 | 1:21 PM

ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరి దృష్టి ఫోటో పజిల్స్‌పై పడింది. మన మెదడుకు మేత వేస్తూ.. కళ్లకు పదును పెడుతూ.. ప్రతీ పజిల్‌ను తగ్గేదేలే అన్నట్లుగా సాల్వ్ చేస్తున్నారు...

Viral Photo: తగ్గేదేలే.! ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టండి చూద్దాం.. అంత ఈజీ కాదండోయ్..
Leopard
Follow us on

సోషల్ మీడియాలో వింతలూ, విశేషాలకు సంబంధించిన వీడియోలకు కొదవలేదు. ప్రపంచం నలమూలలా ఊహకందని వింత సంఘటనలు ఏం జరిగినా కూడా క్షణాల్లో నెట్టింట దర్శనమిస్తుంటాయి. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరి దృష్టి ఫోటో పజిల్స్‌పై పడింది. మన మెదడుకు మేత వేస్తూ.. కళ్లకు పదును పెడుతూ.. ప్రతీ పజిల్‌ను తగ్గేదేలే అన్నట్లుగా సాల్వ్ చేస్తున్నారు. గతంలో వీకెండ్ బుక్స్, మ్యాగజైన్లలో వచ్చే పద సంపత్తి ఒక ఎత్తయితే.. ఫోటో పజిల్స్ మరో ఎత్తు. వీటి పట్ల నెటిజన్లు బాగా ఆకర్షితులయ్యారు. ఫోటో పజిల్స్ కంటూ సోషల్ మీడియాలో ప్రత్యేక పేజీలు ఉన్నాయి. కొన్నిసార్లు పాత ఫోటో పజిల్స్ సైతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఫోటో పజిల్స్ సాల్వ్ చేయాలంటే మీ కళ్లకు పదునుండాల్సిందే.. ఉంటే మీరు క్షణాల్లో కనిపెట్టేయగలరు. తాజాగా ఓ ఫోటో పజిల్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఓసారి మీరూ చూసేయండి.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ చిరుత దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. చూడటానికి మంచుతో నిండిన ఆ ప్రదేశంలో ఓ మంచు చిరుత ఇంచక్కా సేద తీరుతోంది. అదెక్కడుందో మీరు గుర్తించాలి. ఈ ఫోటోలో ఆ చిరుత ఎక్కడుందో కనిపెట్టేందుకు నెటిజన్లు తమ బుర్రకు పదునుపెట్టారు. దాదాపుగా నూటికి 95 శాతం మంది విజయం సాధించారు. లేట్ ఎందుకు మీరు కూడా ఈ ఫోటో పజిల్‌ను ఓసారి ట్రై చేయండి. తీక్షణంగా చూస్తే మొదటి ట్రయిల్‌లోనే కనిపెట్టేస్తారు. ఒకవేళ సమాధానం దొరక్కపోతే క్రింద ఫోటోను చూడండి.

ఇదిలా ఉంటే.. మంచు చిరుతలు అరుదైన జాతికి చెందిన జంతువులు. ఇవి ఎక్కువగా కొండలు, పర్వతాలపై తమ జీవనాన్ని సాగిస్తుంటాయి. వాటికీ నీలం రంగు గొర్రెలు ఇష్టమైన ఆహారం అని చెప్పొచ్చు. అలాగే సాయంత్రం వేళ మంచు చిరుతలు వేటాడుతుంటాయి. అవి ఆ సమయంలోనే చురుగ్గా ఉంటాయి.