Trending Video: చిన్నారి కాదు చిచ్చరపిడుగే.. ఫేమస్ పాటకు అదిరిపోయే స్టెప్పులు.. వీడియో చూసి తీరాల్సిందే..

సోషల్ మీడియా వాడకం ఎప్పుడైతే పెరిగిపోయిందో.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందులోనే మునిగి తేలుతున్నారు. ఉదయం, రాత్రి అనే తేడా లేకుండా ఇంటర్నెట్ లో మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం..

Trending Video: చిన్నారి కాదు చిచ్చరపిడుగే.. ఫేమస్ పాటకు అదిరిపోయే స్టెప్పులు.. వీడియో చూసి తీరాల్సిందే..
Child Dancing Video

Updated on: Jan 29, 2023 | 7:29 AM

సోషల్ మీడియా వాడకం ఎప్పుడైతే పెరిగిపోయిందో.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందులోనే మునిగి తేలుతున్నారు. ఉదయం, రాత్రి అనే తేడా లేకుండా ఇంటర్నెట్ లో మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం చిన్న పిల్లలు కూడా సోషల్ మీడియాలో చేరిపోతున్నారు. ఒక్కోసారి తన గానంలోని మ్యాజిక్‌ని ప్రదర్శిస్తూ .. ఒక్కోసారి డ్యాన్స్‌తో ఆశ్చర్యపరుస్తున్నారు. అదే సమయంలో, కొంతమంది పిల్లలు తమ ప్రదర్శనతో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ప్రస్తుతం ఓ చిన్న అమ్మాయి వీడియో చాలా వైరల్ అవుతోంది. అందులో ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేయడాన్ని చూడవచ్చు. తన హావభావాలతో నెటిజన్లను కట్టిపడేస్తోంది. నిజానికి చిన్న పిల్లలకు సరిగ్గా నడవడం కూడా రాదు. అలాంటి సమయంలో డ్యాన్స్ చేయడం అంటే మాటలు కాదు. అయినా ఈ అమ్మాయి మాత్రం డ్యాన్స్‌లో ప్రావీణ్యం సంపాదించినట్లు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ చిన్నారి ‘బాలన్ తానేదార్ చలావే జిప్సీ’ అనే హర్యానీ పాటకు అద్భుతంగా స్టెప్పులు వేసింది. అంత చిన్న వయసులో పాటలోని అంతరార్థాన్ని అర్థం చేసుకుని, డ్యాన్స్ చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. డ్యాన్స్ చేస్తున్నప్పుడు లిప్ సింక్ చేస్తూ తనకు కావాల్సిన ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తోంది. అలాంటప్పుడు ఈ వీడియోను మెచ్చుకోకుండా ఎవరు ఉంటారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. దీనికి ఇప్పటి వరకు 2.7 మిలియన్ వ్యూస్, 1 లక్షా 50 వేల కు పైగా లైక్స్ వచ్చాయి. అంతే కాకుండా తమకు నచ్చిన విధంగా కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.